సమంత తొలిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. అదే యూ టర్న్. కన్నడ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. సమంత సినిమా కాబట్టి… మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. విడుదలకు ముందే సినిమా అమ్ముకునే ఛాన్స్దక్కింది. రూ.6 కోట్లకు సురేష్ రెడ్డి ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ థియేటరికల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. శాటిలైట్ ఇంకా అవ్వాల్సివుంది. ఎటు చూసినా.. నిర్మాతలకు మంచి బేరమే. సమంత పారితోషికంతో కలపి రూ.14.5 కోట్లతో ఈసినిమా ముగించారు. పబ్లిసిటీకి మరో కోటి రూపాయలు వేసుకున్నా.. రూ.15.5 కోట్లలో ఈసినిమా పూర్తయినట్టు. తమిళంలో ఎంత కాదన్నా మరో ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు వస్తాయి. ఇక తెలుగు, తమిళంలో శాటిలైట్ అమ్మాల్సివుంది. రెండూ కలుపుకుంటే కనీసం రూ.5 కోట్ల వరకూ రావొచ్చు. అంటే విడుదలకు ముందే.. యూటర్న్‌కి లాభాలొచ్చాయన్నమాట. బీ,సీ సెంటర్లోల ఈ సినిమాకి ఎలాంటి వసూళ్లు ఉంటాయో తెలీదు గానీ, మల్టీప్లెక్స్‌లో మాత్రం టికెట్లు బాగానే తెగుతాయనిపిస్తోంది. మాస్లో సమంతకు ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకి కలిసొచ్చే అవకాశం ఉంది.