వరదలతో విలయానికి గురైన కేరళకు.. చేసే ఆర్థిక సాయం.. వచ్చే విరాళాల విషయంలో… వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతం అవుతోంది. కొద్ది రోజులుగా.. దుబాయ్ రూ. 700 కోట్ల సాయం అందించడానికి ముందుకు వచ్చిందని విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి అంగీకరించబోవడం లేదని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. అప్పటి నుంచి.. కేంద్రం తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో అనహ్యంగా భారత్లో ఉన్న యూఏఈ రాయబారి… కేరళకు.. దుబాయ్ ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదన్నారు. దీంతో ఆశ్చర్యపోవడం దేశ ప్రజల వంతయింది.
ఎందుకంటే.. అసలు దుబాయ్ రాజు.. మొదట సాయం చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారని… ట్వీట్ ద్వారా తెలిపింది సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీనే. ఆ తర్వాత రోజు.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా… ప్రెస్మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ప్రధానితో కూడా మాట్లాడానని.. దుబాయ్ నుంచి రూ. 700కోట్లు అందడం ఖాయమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయిది. విదేశీ సాయం తీసుకోవడం లేదని.. దానికి 2004లో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుకున్న రూల్సే కారణమని వాదించడం ప్రారభించింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు.. ఎలాంటి సాయం కేరళకు దుబాయ్ ప్రకటించలేదని.. ఆ దేశ అంబాసిడరే నేరుగా ప్రకటించడంతో… అసలేం జరిగిందోనన్న చర్చ మాత్రం మళ్లీ ప్రారంభమయింది.
కేంద్ర ప్రబుత్వం కేరళ విలయాన్ని చాలా చిన్నగానే గుర్తించింది. జాతీయ విపత్తుగా కూడా ప్రకటించలేదు. రూ. 600 కోట్లు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. అదే సమయంలో రూ. 7వందల కోట్ల ఫండింగ్ విషయంలో.. యూఏఈ నుంచి రావడంతో… కేరళ కాస్తంత ఊరట చెందింది. కానీ కేంద్రం మాత్రం అవమానంగా ఫీలయినట్లు ఉంది. అటూ ఇటూ తిరిగి… కేరళ సాయం.. వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటూండటంతో… యూఏఈ రాయబారిపై ఒత్తిడి తెచ్చి.. ప్రకటన చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్ ఎలాంటిసాయం ప్రకటించకపోతే.. మోడీ.. ఎందుకు ట్వీట్ల ద్వారా కృతతజ్ఞతలు చెప్పారని.. కేరళ సీఎంసూటిగానే ట్విట్టర్ ద్వారా పీఎంవోను ప్రశ్నించారు. దానికి ఇంకా రిప్లయ్ రాలేదు. బహుశా అది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోవచ్చు.