ప్రకృతి బీభత్సంలో అల్లాడుతున్న కేరళకు కొద్ది రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా సినీ, క్రీడా సెలబ్రిటీలు కోట్లకు కోట్లు విరాళాలు ప్రకటిస్తున్నట్లు న్యూస్ పుట్టుకొస్తున్నాయి. కానీ అవన్నీ ఫేక్. కానీ ఒరిజినల్ విరాళం ఒకటి ఆశ్చర్యపోయే రీతిలో కేరళకు వచ్చింది. అదే కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయాన్ని దుబాయ్ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలం అయిపోతున్న కేరళ గురించి తెలుసుకున్న దుబాయి రాజు మహ్మద్ బిన్ రషీద్.. క్రితం ట్విటర్ వేదికగా స్పందించారు. భారతీయ సోదరులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి యూఏఈ పౌరుడికి ఉందంటూ.. ఆయన వరుస ట్వీట్లు చేశారు. అప్పటికప్పుడు కేరళకు సాయం చేసేందుకు ఓ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేశారు. కేరళలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని రూ. 700 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. యూఏఈ సాయంపై ముఖ్యమంత్రి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం మరో గల్ఫ్ దేశం ఖతర్ రూ. 35 కోట్ల విరాళం ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో కేరళీయులు అత్యధికంగా ఉంటారు. అక్కడి వారు పంపే డబ్బులతో భారత్కు భారీగా విదేశీ మారకద్రవ్యం సమకూరుతుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి కేరళ వాసుల సహకారం ఎంతో ఉందని… గల్ఫ్ దేశాల ప్రజలు నమ్ముతారు. అందుకే… కేరళకు జరిగిన నష్టాన్ని తమకు జరిగిన కష్టంగా భావించారు. భారీగా విరాళాలు అందించారు.
భారత్లోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా… కేరళకు తోచినంత సాయం పంపుతున్నాయి. నగదు రూపంలోనే కాకుండా… ఇతరాత్రా మార్గాల్లోనూ… సేవలు అందిస్తున్నాయి. అయితే… సమాఖ్య ప్రభుత్వాన్ని .. టీమ్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న మోడీ.. కేరళకు ఇచ్చింది రూ. 600 కోట్లు మాత్రమే. కేంద్రంతో పోలిస్తే.. కేరళపై.. గల్ఫ్ దేశాలు, సాటి రాష్ట్రాలే ఎక్కువ అభిమానం చూపాయి.