ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సిద్ధం అవుతోంది. ఈ సారి యూఏఈలో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసి..అధికారికంగా ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19నుంచి షార్జా, దుబాయ్, అబుదాబిల్లో మ్యాచులు జరుగుతాయి. ఒకప్పుడు షార్జా అంటే. క్రికెట్‌కు పెట్టింది పేరు. గత కొన్నేళ్ల కాలంలో అక్కడ టోర్నీలు జరగడమే గగనం అయిపోయింది. ఇప్పుడు ఐపీఎల్‌తో మరోసారి షార్జా వెలిగిపోనుంది. దుబాయ్, అబుదాబీల్లోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నస్టేడియాలు ఉన్నాయి. దీంతో.. ఈ మూడు నగరాల్లోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.
సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 8 వరకు జరుగుతుంది. వచ్చే నెలలోనే జట్లన్నీ.. దుబాయ్‌కు చేరుకుంటాయి. అక్కడ క్వారంటైన్ పూర్తయిన తర్వాత టోర్నీ ప్రారంభిస్తారు. యుఏఈలో ప్రస్తుతం కరోనా వైరస్.. కంట్రోల్లో ఉంది. కఠినమైన చర్యలు తీసుకోవడంతో.. పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి ఉంచడంతో.. అక్కడ వైరస్ పెద్దగా ప్రబలడం లేదు. ఆ దేశాలు అంతర్జాతీయ విమానాల రాకపోకులను కూడా ప్రారంభించాయి. ఐపీఎల్ నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు యుఏఈ అంగీకారం తెలిపింది. దాంతో.. ప్రతిష్టాత్మక టోర్నీకి మార్గం సుగమం అయింది.
ఇప్పటికే టీ 20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. ఐపీఎల్ కోసమే వాయిదా వేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఆ ప్రపంచ కప్ వాయిదా వేయడంతో.. ఐపీఎల్‌కు సమయం దొరికింది. మాములాగా అయితే మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉంది. మేలో ముగియాల్సి ఉంది. కానీ.. కోరనా కారణంగా మొత్తం మారిపోయింది. 2014లో ఐపీఎల్ సగం టోర్నీని యూఏఈలోనే నిరవహించారు. యూఏఈలో టోర్నీ నిర్వహణకు భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.