ఉగాది పర్వదినాన్ని పుర్కసరించుకొని టాలీవుడ్ కొత్త సినిమా కబుర్లు, పోస్టర్లు,అప్ డేట్స్ తో సందడి సందడిగా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకి ఈ రోజు కొబ్బరికాయ్ కొట్టారు. చాలామంది ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ ఈవెంట్ కి తరలివచ్చారు.
రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. శ్రీరామ నవమికి ఫస్ట్ షాట్ ని రిలీజ్ చేస్తామని చెప్పారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రామ్ చరణ్ గాల్లో ఎగురుతూ కనిపించాడు. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఓ కొత్త పోస్టర్ వచ్చింది.
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఈ రోజే వచ్చింది. పూరి తప్పకుండా కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన ఈ సినిమాని తర్వలోనే మొదలుపెడతారు.
శర్వానంద్ సంపత్ నంది సినిమా ఏప్రిల్ నుంచి మొదలుపెడతారని అప్డేట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో శర్వా లుక్ కోసం బాలీవుడ్ స్టయిలిస్టులు పని చేస్తున్నారని, శర్వా నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తారని ఓ సాంపిల్ ఫోటో వదిలారు.
అభిషేక్ నామా హరికృష్ణ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ‘సేతు’ అనే సినిమా నిర్మిస్తున్నాడు. రామాయణం ఆధారంగా ఓ కల్పిత కథతో ఈ సినిమా వస్తుందని ప్రకటించారు.
ఇదే కాకుండా కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి, సిద్దు జొన్నల గడ్డ జాక్, నరేష్ రైల్వే కాలనీ, నారా రోహిత్ సుందరకాండ, రాజ్ తరుణ్ పాంచ్ మినార్ తో పాటు మరికొన్ని సినిమాలు కొత్త పోస్టర్స్ తో ఉగాది శుభాకాంక్షలు చెప్పాయి.