ఈ శుక్రవారం రెండు సినిమాలు బాక్సాఫీసు ముందుకు వచ్చాయి. రెండూ హిట్ కాంబినేషన్లే. గోపీచంద్ శ్రీవాస్ -లక్ష్యం లౌక్యం తో గతంలో విజయాలు సాధించారు. ఇప్పుడు రామబాణంతో వచ్చారు. అల్లరి నరేష్, విజయ్ కనకమేడల నాందితో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఉగ్రం చేశారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా హిట్ కాంబినేషన్ ని బ్రేక్ చేశాయనే చెప్పాలి. రామబాణం, ఉగ్రం.. ఈ రెండిటిలో దేనికి హిట్ టాక్ రాలేదు.
రామబాణం.. పాత పరమ రొటీన్ సినిమా అనే టాక్ ని మూటగట్టుకుంది. పాటలు, ఫైట్లు, కామెడీ సీన్లు, ఎలివేషన్స్ ఇలా రొటీన్ టెంప్లెట్ లో ఎక్కడా కొత్తదనం లేకుండా వెళ్ళింది రామబాణం. నరేష్ ఉగ్రం పరిస్థితి మరోలా వుంది. నాంది సినిమాలానే ఒక తీవ్రమైన సమస్య తీసుకున్నారు కానీ దానికి ఇచ్చిన ట్రీట్ మెంట్ రొటీన్ గా మారిపోయింది. పైగా ఫస్ట్ హాఫ్ అంతా కథే చెప్పకపోవడం, సోషల్ సమస్యని డీల్ చేయడంలో అనవసరమైన మాస్ ఎలిమెంట్స్ వాడేయడంతో ఉగ్రం కూడా గతి తప్పింది. మొత్తానికి రెండు హిట్ కాంబినేషన్ లకు ఎదురుదెబ్బ తగిలింది.