అసలు ఉక్రెయిన్ మీద రష్యా ఎందుకు యుద్ధం ప్రకటించింది?. అమెరికాకు, యూరోపియన్ దేశాలకు ఉక్రెయిన్ బాగా దగ్గర అయి రష్యా ముప్పుగా మారుతోందని గుర్తించిన పుతిన్ దాడి చేశాడు. నాటో దేశాల కూటమిలో ఉక్రెయిన్ ను చేర్చుకుంటామని అమెరికా భరోసా ఇచ్చింది. నాటో కూటమిలో సైనిక శక్తి పరంగా బలంగా ఉన్న ముఫ్పై దేశాలు ఉన్నాయి. ఈ 30దేశాల్లో ఎవరిపైనైనా ఇతర దేశాలు దాడి చేస్తూ ఈ 30 దేశాల సైన్యం ఆ దేశంపై దాడి చేసి ఓడించాలన్నది నాటో కూటమి లక్ష్యం. ఇలాంటి కూటమిలో ఉక్రెయిన్ను చేర్చుకుంటే… ఉక్రెయిన్ రష్యా కన్నా ఎన్నో రెట్లు సైనిక శక్తిని సమకూర్చుకున్నట్లే. మరి పుతిన్ ఊరుకుంటారా ?
ఉక్రెయిన్ ను ఊబిలోకి నెట్టేసిన అమెరికా
రష్యాతో చిరకాలంగా ఉక్రెయిన్ కు సమస్యలు ఉన్నాయి. అలాగే రష్యాతో అమెరికాకు శుత్రుత్వం ఉంది. రష్యా అణుబాంబులన్నీ అమెరికాకు గురి పెట్టి ఉంటాయి. రష్యాను కంట్రోల్ లో ఉంచాలంటే ఉక్రెయిన్ బలోపేతం చేయాలని అమెరికాతో పాటు ఈయూదేశాలు అనుకున్నాయి. ఈయూ దేశాల కన్నా అమెరికాకు చాలా ముఖ్యం కనుక ఉక్రెయిన్ కు ఎక్కువ మద్దతు ఇచ్చారు. అమెరికాతో డీప్ గా వెళ్లిపోతే ఉక్రెయిన్ తమ నెత్తి మీద డాన్స్ చేస్తుందని రష్యా.. దాడులు ప్రారంభించింది. ఇలా దాడులు ప్రారంభించగానే అలా అందరూ సైలెంట్ అయిపోయారు. నాటో దేశాల సైన్యం ఉక్రెయిన్ కు సపోర్టుగా రాలేదు.
యుద్ధం కొనసాగించేందుకు మాత్రం సాయం
ఓ వైపు ఉక్రెయిన్ ను పుతిన్ ధ్వంసం చేసేస్తూంటే.. ఏదో విధంగా శాంతి మంత్రం పాటించేలా చేయాల్సిన నాటో దేశాలు.. ఉక్రెయిన్ కు అప్పుడప్పుడు బాంబులు ఇస్తూ రష్యాపై దాడిచేసేలా చూసుకుంటూ వస్తున్నాయి. అంటే యుద్ధం ఆగకుండా.. ఆజ్యం పోస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మరో దారి లేదు. రష్యా కాళ్లపై పడలేడు. అలాగని అగ్రదేశాల మద్దతు లేకపోతే యుద్ధం చేయలేడు. చివరికి సర్వనాశనం అయింది ఉక్రెయినే. కానీ ఇప్పుడు అమెరికా కూడా వదిలేసింది.
నిండా ముంచేయడమే కాకుండా అవమానించిన అమెరికా
రష్యా కాళ్లపై పడాలని.. కీవ్ లో ఖనిజాలను అప్పగించాలని అప్పుడే కాస్తంత సాయం చేస్తామని ట్రంప్ తేల్చేశారు. దాంతో జెలెన్ స్కీకి ఏమీ అర్థం కాలేదు. వాదనకు దిగారు. ఆయనను ఔట్ హౌస్ నుంచి ట్రంప్ గెంటివేయించారు. ఇప్పుడు ఉక్రెయిన్ కు దిక్కూదారి తెలియడం లేదు. యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి కల్పించిన అమెరికా ఇప్పుడు సర్వం వదిలేసుకుని వెళ్లిపో అంటోంది. ఇంత కన్నా ఘోరమైన మోసం ఇంకే దేశమైనా చేయగలదా ?