మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. తాను ఎప్పుడు ఏం చెప్పాలనుకున్నా ప్రెస్‌మీట్ పెట్టి ఉపోద్ఘాతాలు.. ఉదాహరణలతో ఆకట్టుకునేలా చెప్పడం అలవాటు. అంతే కానీ.. తాను చెప్పాలనుకున్నది ఓ ప్రెస్‌నోట్ రూపంలో రిలీజ్ చేయడం ఎప్పుడూ లేదు. అంత అవసరం అయితే చెప్పకుండా మానేస్తారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం కావాలని ఎవరూ అడగరు. ఇప్పుడు కూడా అడగలేదు. అటు ప్రభుత్వం కానీ ఇటు ఉద్యోగ సంఘాలు కానీ ఎలాంటి సలహా అడగకుండానే తనంతటకు తాను బాధ్యత తీసుకుని ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
ఈ ప్రెస్‌నోట్ సారాంశం ఏమిటంటే… జీతాలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.. పెంచిన జీతాలు వద్దని ఉద్యోగులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితి బహుశా మొదటి సారి అనుకుంటా.. కరోనా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పట్టింపులకు పోకుండా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని ఉండవల్లి కోరారు. ఉండల్లి చర్చలు జరుపుకోవాలని ప్రెస్‌నోట్ జారీ చేయడంపై ఆయన అనుచరుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
జీతాలు పెంచితే.. పెంచవద్దని… పాత జీతాలే ఇవ్వాలని సమ్మె చేస్తున్న ఉద్యోగుల వ్యవహారం.. ప్రభుత్వ లెక్కలపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేయగలరు. అది ప్రజల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఒక వేళ ఆయన ఆయన ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే.. కామ్‌గా ఉండగా.. ఈ చిన్న ప్రెస్‌నోట్ ఎందుకు రిలీజ్ చేశారన్నరి మరో డౌట్. ఏదైతేనేం… ఉండవల్లి వైపు నుంచి రెండు వర్గాలకూ ఓ ఉచిత సలహా వచ్చిందనుకోవాలి.