దేశంలో ఐదు విడతల ఎన్నికలు ముగిసిన తర్వాత పిక్చర్ కాస్త క్లారిటీ వచ్చింది. అదే హంగ్ పార్లమెంట్. 2014లో వచ్చిన మోడీ పాజిటివ్ వేవ్ .. ఇప్పుడు.. నెగెటివ్ వేవ్‌గా మారింది. అదే సమయంలో.. అప్పుడు … ఏకైక లీడర్‌గా మోడీకి వచ్చిన ఇమేజ్.. ఇప్పుడు ఏ లీడర్‌కి కూడా లేదు. దాంతో.. మోడీ “దేశ్ కి నేతా”గా కనిపిస్తున్నప్పటికీ… ఆయనకు మాత్రం.. ప్రజలు ఏకపక్షంగా ప్రజలు పట్టం కట్టే పరిస్థితి లేదు. అందుకే.. ఈ సారి చక్రం తిప్పే రాజకీయ నేతలతే కీలక పాత్ర. మరి గతంలో.. ఇలాంటి చక్రం తిప్పిన చంద్రబాబుకు ఆ చాన్స్ వస్తుందా..?
చంద్రబాబు చక్రం తిప్పే స్కిల్స్ పై ఉండవల్లికి అంత నమ్మకమా..?
పది సీట్లు వస్తే.. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతారు. ఇదీ… మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ … చెప్పిన మాట. ఏ విషయాన్ని అయినా నిర్మోహమాటంగా చెప్పే అరుణ్ కుమార్… చంద్రబాబుకు పది సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారో.. లేకపోతే.. అలా వచ్చినా.. ఆయన చక్రం తిప్పుతారని.. విశ్లేషించారో కానీ… ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఢిల్లీ రాజకీయాల్లో ఓ పది సీట్లు చేతిలో పెట్టుకుని… అందర్నీ సమన్వయం చేసుకునే టాలెంట్ ఉంటే చాలు… చక్రం చేతిలో ఉన్నట్లే. ఆ టాలెంట్ చంద్రబాబు వద్ద ఉంది కాబట్టే… ఉండవల్లి అలా వ్యాఖ్యానించి ఉంటారు. ఈ విషయంలో.. ఒక్క ఉండవల్లిదే కాదు.. చంద్రబాబు… గత రాజకీయం చూసిన వాళ్లు కూడా దీనిని ఓకే అంటారు. ఇందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.
అందర్నీ కలిపి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వమే లక్ష్యం..!
కేంద్రంలో కర్ణాటక తరహా పరిణామాలు రావడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. మోడీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్న సూచికలు కనిపిస్తూండటం… ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూండటంతో… రాజకీయ పార్టీలేవీ.. మళ్లీ ఆయనను ప్రధానిగా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది కాంగ్రెస్‌కు కూడా తెలుసు. అయితే.. కాంగ్రెస్ అంత గొప్పగా పుంజుకున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ కన్నా… ప్రాంతీయ పార్టీలకే… అత్యధిక సీట్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. అందర్నీ ఏకతాటిపైన ఉంచే నాయకుడే… కీలకం. ఆ నాయకుడు ఎవరన్నది… ముఖ్యం. ప్రాంతీయ పార్టీలలో ఎవరి ఆకాంక్షాలు వారికి ఉంటాయి. అందర్నీ సంతృప్తి పరిచి.. కూటమిగా… ఉంచగలిగే… పొలిటికల్ స్కిల్స్.. మిగతా వారి కన్నా… చంద్రబాబులోనే ఎక్కువ ఉన్నాయనేది అందరూ అంగీకరించే విషయం. అందుకే… ఉండవల్లి పది సీట్ల లెక్క చెప్పి… చంద్రబాబును సెంటరాఫ్ ఎట్రాక్షన్ చేస్తున్నారని అనుకోవచ్చు.
చంద్రబాబు పొలిటికల్ మేనేజ్మెంట్లో “కింగే”..!
చంద్రబాబుకు .. ప్రాంతీయ పార్టీల నేతలందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మమతా బెనర్జీ, మాయావతి.. తామే ప్రధాని అవడానికి ఉత్సాహ పడుతున్నప్పటికీ.. శరద్ పవార్ లాంటి వాళ్లు చంద్రబాబు పేరును కూడా ప్రతిపాదిస్తున్నారంటే.. దానికి కారణం.. ఆయనకు ఉన్న పొలిటికల్ స్కిల్సే. గతంలో.. దేవేగౌడ, గుజ్రాల్ లాంటి వాళ్లను ప్రధానిని చేయడంలో చంద్రబాబు నిర్ణయమే కీలకం. అప్పట్లోనే చంద్రబాబును ప్రధాని పదవి తీసుకోవాలనే ఆఫర్లు వచ్చాయి. కానీ… ఒక్క సారి ప్రధాని పదవి తీసుకుంటే.. ఆ తర్వాత మళ్లీ సీఎం పదవి చేపట్టడం ఎబ్బెట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశం వస్తే వదిలి పెట్టే చాన్స్ లేదు.