పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్‌కి కూడా నచ్చలేదు. కేంద్రం దారుణంగా మోసం చేస్తున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ఆశ్చర్యపోతున్నారు. మోడీ చొక్కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదని.. కోర్టుకెళ్తే చాలని ఆయన జగన్‌కు సలహా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు.. ఇలా అంచనాలను 2013-14 ధరల ప్రకారం ఇస్తామని అరుణ్ జైట్లీ అంటే.. చంద్రబాబు బీజేపీ సర్కార్ పై మండిపడ్డారని ఉండవల్లి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ ప్యాకేజీ గురించి…పార్లమెంట్లో వెంకయ్యనాయుడు మాట్లాడారని ఉండవల్లి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్, భూసేకరణ వ్యయం భరిస్తామని ఆనాడు కేంద్ర మంత్రి షిండే హామీ ఇచ్చారని.. పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ నేతలు కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదని అరుణ్ కుమార్ ఆవేదన చెందారు. టీడీపీ హయాంలో.. పనులు చురుకుగా సాగుతున్నా.. ఇంటర్నెట్లో జరిగే ప్రచారాల… ఫోటోలు తీసుకు వచ్చి.. పోలవరంలో నాణ్యత లేదని మరొకటని… టీడీపీ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు చేసేవారు. అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత పనులు జరగకపోయినా పెద్దగా స్పందించడం లేదు. అనూహ్యంగా ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి వచ్చే సరికి ఆయనకు మీడియా ముందుకు వచ్చారు. ముంపు ప్రాంతం లేకుండా ప్రాజెక్ట్ ఎలా ఉంటుదని ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు. పోలవరం విషయంలో జరుగుతున్న ప్రతి తప్పును.. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామని.. పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మాట మారుస్తున్నప్పుడు… ఏపీ ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదని ఉండవల్లి ఆశ్చర్యపోతున్నారు.
ఇంత జరుగుతున్నా సీఎం జగన్‌రెడ్డి నోరెత్తలేదేం..? మోడీ కాలర్ పట్టుకోనక్కర్లేదు… కోర్టులో కేసు వేస్తే చాలని జగన్‌కు సలహా ఇస్తున్నారు. కనీసం కేసు కూడా ఎందుకు వేయట్లేదు.. చట్టం అమలు చేయట్లేదని ఎందుకు కేసు వేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. జగన్ కేసులకు భయపడే మోడీ దగ్గర పోలవరం విషయం ఎత్తడం లేదని.. కేసుల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడతారా అని ప్రశ్నించారు. నిజం మాట్లాడుతున్నాడనుకుని జగన్‌కు 151 సీట్లు కట్టబెట్టారని ..ఇప్పుడెందుకు నోరు మెదపట్లేదు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ జరిగినప్పుడు రూ, 55, 587 కోట్లకు ఆమోదించినట్లు నాటి కేంద్రమంత్రి కటారియా ప్రకటించారని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని… కూడా చెప్పారన్నారు. పోలవరం విషయంలో ఉండవల్లి ఏ వ్యూహంతో మీడియా ముందుకు వచ్చారో కానీ.. ఆయన మాటలను.. సీరియస్‌గా తీసుకునే వాళ్లు రాను రాను తగ్గిపోతున్నారు