జగన్ ప్రభుత్వంపై ఇప్పుడల్లా విమర్శలు చేయనని ఉండవల్లి ప్రకటించారు. ఎందుకు చేయరనే ప్రశ్నించే వారికి ఆ అర్హత లేదని చెప్పుకొచ్చారు. అసలు వివాదమే లేని..బాధితులే లేని మార్గదర్శి విషయంలో… ” లైక్ మైండెడ్” పీపుల్ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఉండవల్లి ప్రసంగించి మార్గదర్శిపై ఉన్న కోపం.. రామోజీరావుపై ఉన్న ద్వేషం అంతా వెళ్లగక్కారు. అంతా చేసి ఏమీ చేయలేకపోతున్నామనే ఆవేదన కూడా పడ్డారు. జరిమానా కట్టి ఆదర్శంగా ఉండాలని రామోజీరావుకు సలహా ఇచ్చారు.
అసలు మార్గదర్శిపై పోరాడటానికి తానెవర్ని అని ప్రశ్నిస్తున్నారని.. మరి జగన్ పై కేసులు వేయడానికి అచ్చెన్నాయుడు ఎవరని ఉండవల్లి ప్రశ్నించారు. ఈ మాటలతోనే ఆయన ఏ ఉద్దేశంతో మార్గదర్శి ఇష్యూ మీద హడావుడి చేస్తున్నారో ఎవరికైనా అర్థమైపోతుంది. నిజానికి ఇప్పుడు మార్గదర్శిపై ఉండవల్లి మాట్లాడుతున్న కేసు ఇప్పటిదికి కాదు పదిహేడేళ్ల కిందట సెటిల్ అయిపోయిన కేసు, హైకోర్టు కూడా కొట్టి వేసింది. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇందులో వివాదమేదీ లేదు కదా అంటే.. డిపాజిిట్ దారులెవరో ఎవరికీ తెలియదని.. వారి పేర్లు బయటపెట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయమూర్తి ఆ డిపాజిట్ దార్ల పేర్లు వెల్లడించాలన్నారు. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేశారు.
ప్రస్తుతం నడుస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ సోదాలకు.. ఉండవల్లి చెబుతున్న కేసుకు సంబంధం లేదు. అయినా దీనిపైనా వ్యాఖ్యానించారు. చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ కంపెనీల చట్టం అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. చిట్ ఫండ్ వ్యాపారం చేస్తే అదికంపెనీ కాకుండా పోతుందా అనే ప్రశ్న ఆయన వేసుకోలేదు. రామోజీరావు మీద తన ప్రసంగంలో చాలానే విషయం కక్కారు. ఆయన అన్నింటికీ అతీతడన్నట్లుగా మాట్లాడారు. చివరికి అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద ఉన్నదాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఓ రకమైన ద్వేషభావంతో మంచిచెడూ విచక్షణ కోల్పోయిన తీరులా ఉండవల్లి ప్రసంగం కొనసాగింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పనులూ సక్రమంగా సాగిన మద్యం బాటిళ్లను ప్రదర్శించి ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్రం సర్వ నాశనమైపోయినా.. ఎన్నికలకు ముందు జగన్ గురించి మాట్లాడనని చెబుతున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రత్యేకంగా ఎవరికీ లాభమో జనమే నిర్ణయించుకోవాలి.