వివేకానందరెడ్డి, డాక్టర్ సుధాకర్లా తనను వైసీపీ వాళ్లు చంపేస్తారేమోనని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భయంతోనే తాను ఏపీ వదిలి వచ్చేశానన్నారు. సజ్జల నుంచి తనకు ప్రాణహానీ ఉందని.. ఏపీ వస్తే తనకు ప్రాణహాని లేదని ఎన్హెచ్ఆర్సీ హామీ ఇస్తేనే తాను ఏపీకి వస్తానని ప్రకటించారు. ఏపీలో శాంతిభద్రతులు అసలు లేవని… మహిళా ఎమ్మెల్యేకు కూడా ఏఅపీలో రకషణ లేదన్నారు. గత మూడు రోజుల పరిణామాలపై హైదరాబాద్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆమె వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుంచే తనపై కుట్రలు చేస్తున్నారని… మహిళ అని చూడకుండా దారుమమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి నుండి శ్రీదేవి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారని.. తనేమైనా గ్యాంగ్ స్టర్నా అని ప్రశ్నించారు. ఉద్దండరాయుని పాలెంలో ఇసుక మాఫియా ఎవరిదని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. కొంత మంది వైసీపీ నేతుల మీడియా సాయంతో వేధిస్తున్నారని .. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి ఎక్కడికి పోదని చెప్పినందుకే తనను వేదిస్తున్నారని … అమరావతి రైతుల కోసం తాను ప్రాణం అయినా ఇస్తానన్నారు. అమరావతిలో కనీస అభివృద్ధి కూడా చేయడం లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన దాంట్లో పది శాతంకూడా చేయలేదని విమర్శించారు. తనను సస్పెండ్ చేశారని.. తాను ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేనన్నారు. తాను డబ్బులు తీసుకున్నానని ప్రచారం చేస్తున్నారని అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దామా అని సజ్జలకు సవాల్ చేశారు. నియోజకవర్గ సమస్యల కోసం పోరాడతాననిప్రకటించారు.
నాలుగేళ్లుగా బానిస సంకెళ్లలో ఉన్నానని జగన్ మమ్మల్ని కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. త్వరలో జగన్కు మంచి రిటర్న్ గిఫ్ట ్ఇస్తానన్నారు. అమరావతి రైతులకు ఏమీ చేయలేకపోతున్నానని మథనపడేదానన్న ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.