ఇంగ్లిష్ మీడియంలోనే చదివితేనే ఉద్యోగాలొస్తాయని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికెళ్లినా ఉదరగొడుతున్నారు. కానీ ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉద్యోగాలు లేని వాళ్లు.. కోకొల్లలుగా ఉన్నారు. ఇంగ్లిష్ వచ్చినంతనే ఉద్యోగాలివ్వరని.. ప్రతిభ కావాలని.. టాలెంట్ కావాలని.. స్కిల్ కావాలని.. ఆ ఉద్యోగాలు పొందలేని.. ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్స్ అంతా.. వేల రూపాయలు వెచ్చించి కోర్సుల మీద కోర్సులు చేసుకుంటున్నారు . కానీ ఘనత వహించిన ముఖ్యమంత్రి గారు ఇంగ్లిష్లో చదవితే ఉద్యోగాలొచ్చేస్తాయంటున్నారు.
తొంభై శాతం నిరుద్యోగులు ఇంగ్లిష్ మీడియం బాపతే…!
గుంటూరు నుంచి హైదరాబాద్ వరకూ.. ఏ చిన్న ఉద్యోగానికైనా ఇంటర్యూ పెట్టండి… ఇంటర్యూకు వచ్చే వారిలో 90శాతానిపైగా ఇంగ్లిష్ మీడియం లో చదువు ఫినిష్ చేసిన వారుంటారు. ఇంగ్లిష్లో బాగా మాట్లాడగలరు. మాట్లాడగలరంటే.. దానర్థం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయని కాదు. జస్ట్ మాట్లాడగలరు అంతే. ఈ తొలంభై శాంత మంది ఇంగ్లిష్ మీడియం కుర్రాళ్లకు..ఉద్యోగాలు రావు. పది మంది మాత్రమే.. తెలుగు మీడియంలో చదివిన వాళ్లు ఉంటారు. వాళ్లకి కూడా ఇంగ్లిష్ మాట్లాడటం వస్తుంది. భావ వ్యక్తీకరణ బాగుంటుంది. ఎక్కువ అవకాశాలు వారికే దక్కుతాయి. ఈ తొంభై శాతం మంది కన్నా.. ఆ పది శాతం మందికే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా చూసినా.. ఇప్పుడు ఉద్యోగాలు లేక.. రోడ్డుపై తిరుగుతున్న వారిలో.. తొంభై శాతం నిరుద్యోగులు ఇంగ్లిష్ మీడియం బాపతే.
వారందరికీ ఉద్యోగాలు ఎందుకు రాలేదు జగన్ గారూ..!?
ఉద్యోగాలు రావాలంటే.. ఇంగ్లిష్ మీడియం రావాల్సిందేనని.. ఇంగ్లిష్ మీడియంలో చదివితే.. గొప్ప గొప్ప ఉద్యోగాలు వస్తాయని.. సీఎం ఉదరగొడుతున్నారు. సీఎం కప్పి పెడుతున్న విషయం ఏమిటంటే… ఇప్పటికి ప్రైవేటు స్కూళ్లలో తెలుగు మీడియం దాదాపు అంతరించిపోయింది. చాలా పరిమితంగా తెలుగు మీడియం ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చదివే స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఏపీలో 90శాతానిపైగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఫార్ములా ప్రకారం… వారందరికీ ఉద్యోగాలు రావాలి. రోబోటిక్స్లోనే కాదు.. ఇంక వేరే దేంట్లో అయినా ఉద్యోగాలు రావాలి. కానీ ఎందుకు రావడం లేదు..? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలరా..?
భాష కాదు.. స్కిల్స్ ముఖ్యమని గుర్తించలేరా..?
ఇంగ్లిష్ చదివితేనే.. గొప్పగా ఎదిగిపోవచ్చని.. జగన్ నూరి పోస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికి ఇతరులు.. ఇంగ్లిష్ నేర్పొద్దని.. అడ్డుపడుతున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. కానీ..బాలల భవిష్యత్లో ఇలా రాజకీయం చేయడం.. ఏ మాత్రం సమంజసం కాదు. అన్ని సౌకర్యాలు పెంచి.. సరిగ్గా చదువు చెప్పగలిగే టీచర్లను పెట్టి… అన్ని రకాల మీడియంలోనూ.. చదువులు చెప్పొచ్చు. దాని కోసం మాతృభాషను చంపడాన్నే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లిష్ చదువులు వద్దని ఎవరూ చెప్పడం లేదు. చదువుల్లో నాణ్యత పెంచి.. స్కిల్స్ పెరిగేలా.. విద్యావిధానం మారితే.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ సమస్య కాదు.
పేదలకు ఇంగ్లిష్ చదువులొద్దా.. అంటూ.. రెచ్చగొట్టే రాజకీయం చేయడానికి బాగానే ఉంటుంది. కానీ.. దాని కింద పడి నలిగిపోయేది.. ఆ పేద కుటుంబాలకు చెందిన బాలలే. అది జరిగినా.. సీఎంకు పోయేదేమీ ఉండదు.. ఆయన రాజకీయ ప్రయోజనం ఆయనకు వస్తుంది. పేద బాలల భవిష్యత్.. ఆ రాజకీయ పదఘట్టనల్లో నలిగిపోతుంది. గుర్తించేంత తెలివి వారికి రాదు కూడా..!