బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ సీన్ ఎప్పటికీ మర్చిపోలేం. కట్టప్ప అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచిన సీన్… కళ్లముందు కదులుతూనే ఉంటుంది. అప్పటి నుంచే బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి సాక్షాత్తూ రాజమౌళినే సమాధానం చెప్పడం లేదు. పార్ట్ 2లో చూసి తెలుసుకోండి అంటున్నాడు. అసలు సిసలు ట్విస్టేంటంటే… కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపలేదు.. బాహుబలి బతికే ఉన్నాడు. అదెలా… అన్నది సెకండ్ పార్ట్‌లో తెలుస్తోందని టాక్. ఈ ట్విస్టుకు సంబంధించిన క్లూ కూడా రాజమౌళే ఇచ్చాడు.
బాహుబలి క్లైమాక్స్ షూటింగ్ సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. దానికి సంబంధించి ఓ స్టిల్ కూడా రాజమౌళి ట్విట్టర్లో పెట్టాడు. రక్తమొడ్డుతున్న ఓ చేయి విజయగర్వంతో ఆకాశంపైపు చూస్తుంటుంది.. కింద.. వేలాది జనం. అందులో రాజమౌళి అండ్ టీమ్ కూడా ఉంది. ఈ స్టిల్‌లోనే ట్విస్ట్ రివీల్ చేశాడట జక్కన్న. ఆ చేయి అమరేంద్ర బాహుబలిదేనట. అతని పాత్రని సెకండాఫ్‌లో రివీల్ చేసే సీన్.. తెరకెక్కిస్తూ తీసిన స్టిల్లన్నమాట అది. అంటే.. బాహుబలి చచ్చిపోలేదన్నమాట. బతికే ఉన్నాడు. అదెలా అన్నది సెకండాఫ్‌లో చూపిస్తారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న ఇక ముందు తలెత్తదేమో..!