పదేళ్లు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీకి మళ్లీ కొత్తగా చేసేదేమీ లేదు.. ఇలా బండి నడిచిపోతే చాలనుకుంటున్నట్లుగా ఉన్నారు. ఆయన కేబినెట్ పూర్తిగా పాత వాసనలతో ఉంది. ముఖ్యంగా కీలకమైన ఆర్థిక, రక్షణ, హోం, రైల్వే, రోడ్లు వంటివన్నీ పాత వారికే కేటాయించారు. వీరిలో జనంపై అత్యధిక ప్రభావం చూపే శాఖ ఆర్థిక శాఖ. ఈ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రజల్లో ఉన్న నెగటివిటీ అంతా ఇంతా కాదు. కనీసం లోక్ సభకు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపని ఆమెను తిరిగి కేబినెట్ లో తీసుకుని కేంద్రమంత్రిని చేశారు.
నిర్మలా సీతారామన్ వ్యవహారశైలి, ఆమె మీడియాతో మాట్లాడేటప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలపై చేసే వ్యాఖ్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. పన్నుల విధానం విషయంలో ఇంకా పిండుకోవాలనుకున్నట్లుగా ఉండే ఆమె తీరు బీజేపీపై మధ్యతరగతి ప్రజల్లో వ్యతిరేకతపెంచింది. వీటిపై మోదీకి ఫీడ్ బ్యాక్ లేదేమో కానీ మళ్లీ ఆమెను తెచ్చి ఆర్థిక శాఖనే కట్టబెట్టారు. నిజానికి మోదీ 2.0లోనే ఆమెను తప్పిస్తారన్న ప్రచారం జరిగింది.
ఇక హోంమంత్రి గా అమిత్ షా వ్యవహారంపైనా విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతల్ని జైళ్లలో పెట్టి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని .. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పై రైలు ప్రమాదాల మచ్చ ఉంది. అయిదే మోడీ… వీరిపై ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
ఇతర దేశాల్లో పట్టుమని నలభై ఏళ్లు లేని వాళ్లు దేశాలను నడిపే అధ్యక్షులు అవుతుననారు. కానీ ఇండియాలో మాత్రం..ఓ యువకుడికి కీలకమైన కేబినెట్ మినిస్టర్ ఇవ్వడానికి సంకోచించారు. కీలకమైన శాఖలన్నీ పండిపోయిన వృద్ధులే నిర్వహించాన్నట్లుగా వ్యవహరించారు. రామ్మోహన్ నాయుడుకు ఏవియేషన్..చిరాగ్ పాశ్వాన్ కు స్పోర్ట్స్ ఇచ్చి సరి పెట్టారు.
ఓవరాల్‌గా చూసుకుంటే.. మోదీ 3.0 టీమ్ పై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే వారి పని తీరు గత ఐదేళ్లుగా చూశారు మరి.