విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లింది. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కుమారస్వామి…ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో ప్లాంట్ లో వంద శాతం సామర్ధ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు.
ఓ ఆంగ్ల పత్రిక కథనం ముందుంచి స్టీల్ ప్లాంట్ పై వైసీపీ రాజకీయం చేయాలనుకుంది. గురువారం కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ అంశంపై కుమారస్వామి క్లారిటీ ఇవ్వకపోతే ప్రైవేటీకరణ కోసమే ఈ ముందస్తు పర్యటన అని, కొద్ది రోజుల్లోనే ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతుందని ప్రచారం చేయాలనుకున్నారు. విశాఖలో మళ్లీ పట్టు సాధించేందుకు దీనినొక అస్త్రంగా మార్చుకోవాలనుకున్నారు.
కానీ ఏం లాభం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం లేదని అటు కేంద్రమంత్రి, ఇటు ముఖ్యమంత్రి ఒకే సమయంలో స్పష్టత ఇచ్చారు. ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని వారికీ అన్యాయం చేసేలా నిర్ణయం తీసుకోబోమన్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ పై వైసీపీ చేయాలనుకున్న రాజకీయం కాస్త బెడిసికొట్టినట్లు అయింది.