బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులు, అక్కడి భద్రతా దళాలతో చర్చించిన తర్వాత బంగ్లా ప్రధాని రాజీనామా చేశారని… ఆ తర్వాత షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారని కేంద్రమంత్రి జైశంకర్ ప్రకటించారు. ఫ్లైట్ క్లియరెన్స్ కోసం ఆమె చేసిన విజ్ఞప్తిని అంగీకరించామని, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసినా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నట్లు ప్రకటించారు.
బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అక్కడి ఆర్మీతోనూ టచ్ లో ఉన్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని, ఢాకా అధికారులతో గడిచిన 24గంటల్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు.
అక్కడ జూన్ లో మొదలైన స్టూడెంట్ ఉద్యమం ఉగ్రరూపం దాల్చి…హింసాత్మకంగా మారిందని, ఆ తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆర్మీకి చెప్పి హసినా రాజీనామా చేశారన్నారు. కేవలం 45నిమిషాల్లో రాజీనామా చేయాలని ఆర్మీ ఇచ్చిన అల్టీమేటంతో రాజీనామా చేయటం, ఇండియాకు రావటం చకచకా జరిగిపోయాయి.
ఇక బంగ్లా పార్లమెంట్ ను అక్కడి రాష్ట్రపతి రద్దు చేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
రిజర్వేషన్లకు సంబంధించి షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంపై అక్కడి యువత భగ్గుమంది. ఉద్యమం తీవ్రరూపం దాల్చటంతో… ఆర్మీ రంగ ప్రవేశం చేసి, ప్రధానిని రాజీనామా చేయాలని ఆదేశించింది.