కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. వాళ్లు కలిసి ఉండరు అని పదేపదే బీఆర్ఎస్ విమర్శలు చేసింది. నల్గొండకు చెందిన లీడర్.. ఖమ్మం చిన్న లీడర్ ప్రభుత్వాన్ని పడగొడతారని చాలాసార్లు ఓపెన్ కామెంట్ చేశారు కానీ, కాంగ్రెస్ లో అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలనాపరమైన విషయాల్లో మంత్రులను భాగస్వామ్యం చేస్తూ ఎలాంటి అసంతృప్తికి తావు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రేవంత్ సీఎం పగ్గాలు చేపట్టగానే కాంగ్రెస్ లో సీనియర్లు, జూనియర్లు అనే వార్ మళ్లీ తెరమీదకు వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేసింది. అది తమకు అనుకూలంగా మారుతుందని లెక్కగట్టింది. కానీ, సీన్ మరోలా ఉండేసరికి బీఆర్ఎస్ ఆశ్చర్యపోతోంది. మొదట్లో రేవంత్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని చిన్న, చిన్న ఘటనలను ఉదహరిస్తూ ఆరోపణలు చేసింది. ఇటీవల కాంగ్రెస్ లో అంతర్యుద్దం అంటూ బీఆర్ఎస్ అనుకూల పత్రికలో ప్రచారం ప్రారంభించారు. కానీ ఎక్కడా మంత్రుల్లో అసంతృప్తి కనిపించడం లేదు. ఒకవేళ ఆ అసంతృప్తి ఉన్నా బయట పడటం లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ ప్రచారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మైలేజ్ తీసుకురావడం..అగ్రనేతలను ఆకట్టుకోవడం.. ఇవన్నీ అధిష్టానం వద్ద రేవంత్ కు ప్రాధాన్యతను పెంచాయి. ఈ క్రమంలోనే రేవంత్ నిర్ణయాలను సీనియర్లు ఎవరూ తప్పుపట్టడం లేదు. విధానపరమైన విషయాల్లో మంత్రుల అభిప్రాయాలను గౌరవిస్తూ రేవంత్ ముందుకు వెళ్తున్నారు. సంవత్సరంలోపే సొంత పార్టీ నేతల కుమ్ములాటలతో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ కు ఆశానిపాతమే ఎదురైంది. రేవంత్ టీమ్ లో ఫ్రెండ్లీ అట్మాస్పియర్ చూసి కాంగ్రెస్ శ్రేణులు సైతం సంబరపడుతున్నాయి.