నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో రాబోతున్న ‘అన్‌స్టాపబుల్ 2’ మొదటి ఎపిసోడ్ ప్రోమో అదిరిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు, మాజీ మంత్రి లోకేష్ అతిధులుగా పాల్గొన్న ఈ ఎపిసోడ్ ప్రోమో సీజన్ 2కి కావాల్సిన హైప్ తీసుకొచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో వ్యక్తిగత, వృత్తిపరమైన ఎన్నో విశేషాలు పంచుకున్నారు చంద్రబాబు.
బాలకృష్ణ చాలా సరదా ప్రశ్నలు అడుగుతూనే రాజకీయాలకు సంబధించిన అంశాలని కూడా ప్రస్థావించారు. రాజకీయలకు సంబధించిన ప్రశ్న అడిగినపుడు ” ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా? కాళ్లు పట్టుకుని అడిగా ’ అని చంద్రబాబు బాలకృష్ణను ఉద్దేశించి సీరియస్‌గా మాట్లాడటం క్యూరియాసిటీని పెంచింది.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డితో స్నేహం, కాలేజీ డేస్, పర్శనల్ లైఫ్ ఇలా చాలా అంశాలని పంచుకున్నారు చంద్రబాబు. తర్వాత లోకేశ్ సేపు హోస్ట్‌గా మారి చంద్రబాబు, బాలకృష్ణలని పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. మొత్తానికి మొదటి ఎపిసోడ్ ప్రోమోతో ‘అన్‌స్టాపబుల్ 2’ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 14న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.