‘అన్‌స్టాపబుల్’ షోలో బాలకృష్ణ ఎనర్జీ మాములుగా లేదు. చేతికి కట్టు కట్టుమరీ వంటి చేత్తో షోని నడుపుతున్నారు బాలయ్య. ఆయన హోస్టింగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ షో నుంచి కొత్త ప్రోమో వచ్చింది. అఖండ టీం షోకి వచ్చింది. ఈ సందర్భంగా బాలయ్య సందడి మాములుగా లేదు. దర్శకుడు బోయపాటి, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్‌తో కలిసి బాలకృష్ణ తెగ హంగామా చేశారు. ‘నేనూ విలన్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ అందులో హీరో కూడా నేనే” అని బాలయ్య అనడం.. ‘మీరు ప్రపంచానికి ప్రశ్నేమో నాకు మాత్రం సమాధానం’ అని బోయపాటి చెప్పడం,, శ్రీకాంత్ చెప్పిన అఖండ డైలాగ్స్.. అన్నీ అద్భుతంగా పేలాయి.
ప్రజ్ఞ జైస్వాల్ బాలయ్యని బాలా అని పిలవడం,” పాట నీది.,. పిల్ల మాత్రం నాది”అని తమన్ తో బాలయ్య అనడం .. నవ్వులు పూయించింది. ఇక ప్రోమో చివర్లో పొలిటకల్ టచ్ కూడా వుంది . తండ్రి నందమూరి తారక రామారావుని గుర్తుచేసుకుని బాలకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ”వెన్నుపోటు అంటూ అప్పట్లో తప్పుడు ప్రచారం చేశారు. దాని గురించి చెప్తుంటే కళ్లలో నీళ్లొస్తాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని.. ఆయన అభిమానుల్లో ఒకడిని’ అంటూ బాలయ్య చెప్పిన మాటలు ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచాయి. మొత్తానికి అఖండ మాస్ జాతర ఈ ఎపిసోడ్ ప్రోమోలో కనిపించింది.