ఉపాసన సేవా దృక్పథం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదో రూపంలో తన సాయం వీలున్నప్పుడల్లా అందిస్తూనే ఉంది. ఈ విషయంలో చాలా మంది సెలబ్రెటీలకు మార్గదర్శనం చేస్తోంది. తాజాగా ఉపాసన మరో మంచి పనిచేసింది. తన ఇంట్లో చాలా కాలంగా వాడకుండా ఉన్న వస్తువులు, దుస్తులు.. మూటగట్టి, వాటిని పంచడానికి సిద్ధమైంది.
మన ఇళ్లలోనూ.. వాడని, మనకు పనికిరాని వస్తువులు చాలా ఉంటాయి. వాటి అవసరం మనకు లేకపోవొచ్చు. ఆ వస్తువు విలువ తెలిసినవాళ్లకో, అవసరం అయిన వాళ్లకో అందిస్తే మాత్రం, ఆ వస్తువుకి సార్థకత లభిస్తుంది. ఉపాసన అదే చేసింది. అందుకే నెటిజన్లు మరోసారి ఉపాసన చేసిన పనికి భేష్ అంటూ.. మెచ్చుకోళ్లు అందిస్తున్నారు. `మేము సైతం` అంటూ ముందుకు వస్తున్నారు. రైస్ బకెట్ ఛాలెంజ్‌లా… దీన్ని కూడా ఓ సవాలుగా తీసుకుంటే, చాలామందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడినవాళ్లం అవుతాం. మిగిలిన సెలబ్రెటీలూ ఈ దిశగా తమ వంతు సాయం అందిస్తే బాగుంటేందేమో..?