తెలంగాణలో తాజాగా అనుమతులు వచ్చిన మెడికల్ కాలేజీలతో కలిపి జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చింది. విభజన తర్వాత ఏర్పాటు చేసిన ప్రతి జిల్లాకు కూడా మెడికల్ కాలేజీ వచ్చింది. మరి ఏపీ లో ఎందుకు రాలేదు ?. జగన్ రెడ్డికి తన పరిపాలనలో చాన్స వచ్చింది. దాన్ని ఆయన డబ్బులు వచ్చే పనులు వరకూ చేశారు కానీ అసలు పనులు చేయలేదు. కాలేజీ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నించలేదు. ఇప్పుడు మాత్రం.. తాను మెడికల్ కాలేజీలు తెచ్చేశానని ప్రచారం చేసుకుంటున్నారు.
ఎప్పుడో మూడేళ్ల కిందట.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ శంకుస్థాపనుల చేశారు. వాటి సంఖ్య పదిహేడు. మూడేళ్లలో వాటిని నిర్మించలేకపోయారు. సగానికిపైగ కాలేజీలు పునాదుల దగ్గరే ఉన్నాయి. పోనీ అనుమతులు వచ్చిన కాలేజీలకైనా పనులు పూర్తి చేశారా అంటే.. అదీ లేదు. స్వయంగా పులివెందుల మెడికల్ కాలేజీని తనిఖీ చేసిన మెడికల్ కౌన్సిల్ .. పనికి రాదని తేల్చారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఆఘామేఘాలపై ఆ కాలేజీకి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.
అనుమతులు వచ్చిన రెండు, మూడేళ్ల వరకూ కూడా సౌకర్యాలు కల్పించకపోవడం కన్నా చేతకాని తనం ఉండదు. కానీ ఇప్పుడు… మూడు నెలల కూడా కానీ కొత్త ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన ట్వీట్లు చేస్తున్నారు. తెలంగాణతో పాటు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనా ఉపయోగించుకునేందుకు ముందుగు రాలేదు. కానీ ముందుగా పేర్లు పెట్టేసుకునేందుకు… తాము పదిహేడు కాలేజీలకు శంకుస్థాపన చేసినందుకు.. ఏకంగా యూనివర్శిటీ పేరును మార్చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రజాద్రోహం చేయడంలో జగన్ రెడ్డిని మించిన వారు లేరని.. మెడికల్ కాలేజీ వ్యవహారంతో మరోసారి నిరూపితమయింది.