వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అందుకోసం వరుణ్ చాలానే కష్టపడుతున్నాడు. ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై చిత్రబృందం ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే వరుణ్ ట్వీట్ తో ఈ సినిమాలో ఉపేంద్ర ఎంట్రీ ఖాయమైపోయింది.
ఈరోజు ఉపేంద్ర పుట్టిన రోజు. ఈ సందర్భంగా వరుణ్ ఓ ట్వీట్ చేశాడు. ఉపేంద్రకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూనే, `మీతో కలిసి నటించడానికి ఎదురుచూస్తున్నా` అని ట్వీటాడు. దాంతో. ఈ సినిమాలో ఉపేంద్ర ఎంట్రీ ని అధికారికంగా ఖరారు చేసినట్టైంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ మొదలుకాబోతోంది. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి `ఎఫ్ 3` షూటింగ్ మొదలెడదామని భావిస్తున్నాడు వరుణ్.