సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడమే ఇప్పుడు పెద్ద జోక్‌గా మారిపోయింది. సినిమా వాళ్లు రాజకీయాల్లో తేలిపోతారని చెప్పడానికి బోలెడన్ని సాక్ష్యాలు కళ్లముందే కదలాడుతున్నాయి.ఇప్పుడు మరో ఉదాహరణ చేరడానికి సిద్ధమైంది. అయితే తెలుగు నాట కాదు. కన్నడలో. అక్కడ స్టార్ హీరోగా చెలామణీ అవుతున్నాడు ఉపేంద్ర. తనకు కన్నడలో మంచి ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఉంది. దాన్ని నమ్ముకుని కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ అనే ఓ పార్టీ స్థాపించాడు. ఈ పార్టీ ప్రారంభించి ఆరు నెలలు కూడా కాలేదు. అంతలోనే.. బోర్డు తిప్పేస్తున్నట్టు టాక్. త్వరలోనే ఉపేంద్ర బీజేపీలోకి చేరడానికి రెడీ అయిపోతున్నాడట. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని. ఉపేంద్ర పార్టీలో చేరినవాళ్లంతా… ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే.. గెలవడం కష్టమని భావించిన ఉపేంద్ర.. ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇలా పార్టీ పెట్టిన తరవాత.. తొలి ఎన్నికల వరకూ ఎదురు చూడకుండానే… మరో పార్టీలోకి జంప్ అయిపోయిన ఘనత ఉపేంద్రకే దక్కుతుందేమో. మరి రజనీ, కమల్‌లు ఏం చేస్తారో..??