ఉపేంద్ర సినిమా అంటే ఓ క్రేజ్. ఆయన టైటిల్స్, స్క్రీన్ ప్లే అన్నీ కొత్తగా ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్ షాకింగ్ గా అనిపిస్తుంది. సినిమా అంటే ఇలాక్కూడా తీయొచ్చా? అనుకొనేలా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తారాయన. ఇప్పుడు ఆయన్నుంచి `UI` అనే సినిమా వస్తోంది. ఈ చిత్ర విశేషాల్ని ఉపేంద్ర తెలుగు 360తో ప్రత్యేకంగా పంచుకొన్నారు. అందులోని హైలెట్స్…
* సినిమాని నేను కొత్తగా తీస్తానని ఎప్పుడూ అనుకోను. నాకంటే కొత్తగా తీసినవాళ్లు చాలామంది ఉన్నారు.
* స్క్రీన్ ప్లే గురించి ఎలాంటి బుక్స్ చదవలేదు. చదివిన వాళ్లు సినిమాని ఇంకా బాగా అర్థం చేసుకొంటారేమో తెలీదు.
* కన్నడలో 20 ఏళ్ల క్రితమే గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. అయితే అవి అంతగా ఎక్స్ప్లోర్ కాలేదు.
* కేజీఎఫ్, కాంతార సినిమాలు కన్నడ సినిమాల స్థాయిని పెంచాయి.
* బడ్జెట్ల వల్లే సినిమాలు ఆడేయవు. ఓ హిట్ సినిమాకు బడ్జెట్ తో సంబంధం ఉండదు.
* నా తొలి సినిమా కేవలం 70 లక్షల్లో తీశా. అప్పుడు సినిమా ఎలా తీయాలో కూడా నాకు తెలీదు.
* నాకు తెలిసి అవకాశం రావడడమే గొప్ప. పారితోషికం బోనస్ గా భావించేవాడ్ని.
* నా సినిమాల్ని, పాత్రల్నీ పూరి జగన్నాథ్ స్ఫూర్తిగా తీసుకొన్నారని చెబితే అది కేవలం ఆయన గొప్పదనం మాత్రమే. నాకు సమాజమే స్ఫూర్తి. చుట్టూ ఉన్నవాళ్ల నుంచే పాత్రలూ కథలు పుడతాయి.
* యూఐ సినిమా కోసం మేం కొత్త ప్రపంచాన్నేం సృష్టించలేదు. ఉన్న ప్రపంచాన్నే కొత్తగా చూపిస్తున్నాం.
* యూఐ అంటే అర్థం ఏమిటి? ఈ సినిమాతో నేనేం చెప్పదలచుకొన్నాను అనేది సినిమా చూశాక ప్రేక్షకులే తెలుసుకోవాలి.
ఉపేంద్ర పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి