జరిగేది పంచాయతీ ఎన్నికలైనా.. ఎమ్మెల్యే , ఎంపీల ఎన్నికలైనా చివరికి జరిగేది అర్బన్ బ్యాంక్ ఎన్నికైనా.. పంచాయతీ ఎలక్షనైనా వైసీపీ స్టైల్ ఒకటే. తిరుపతి అర్భన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎలా దొంగ ఓట్లు గుద్దుకున్నారో సోషల్ మీడియాలో తేలిరపోయింది. ఇక ఎక్కడ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరిగినా అదే పరిస్థితి అనుకున్నారు. కానీ స్వయంగా హోంమంత్రి నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. వైసీపీ అభ్యర్థులే పోటీలో లేకుండా పోయారు.
హోంమంత్రి తానేటి వనిత నియోజకవర్గం కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇలా అయింది వైఎస్ఆర్సీపీకి చెందిన అభ్యర్థులకు కాదు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి. ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. హోంమంత్రి తానేటి వనిత.. ఆ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను నిలబెట్టి గెలిపించాలనుకున్నారు. వైఎస్ఆర్సీపీ హైకమాండ్ కూడా అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హోంమంత్రి తానేటి వనితకు ప్రత్యేకమైన సూచనలు చేశారు. ఆ ప్రకారం పార్టీ నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు.
అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే గెలవాలని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తిరుపతి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించిన వ్యవహారం ఇంకా కిళ్ల ముందుఉన్నందున కొవ్వూరులోనూ ఆ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు. కనీసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీలో నిలబడలేదు. మొత్తం అర్బన్ బ్యాంక్లో 11 డైరక్టర్ స్థానాలు ఉంటే అన్ని స్థానాలూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకుడు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణ ను డైరెక్టర్లు అందరూ కలిసి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మద్దిపట్ల శివరామకృష్ణ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అవడం ఐదో సారి.