ఇటీవల ఓ గిరిజనుడ్ని కూర్చోబెట్టి ఓ బీజేపీ నేత మూత్రం పోసిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ బాధితుడ్ని సీఎం చౌహాన్ పిలిచి కాళ్లు కడిగారు. ఆ వివాదం అలా నడుస్తూండగానే అంత కంటే పెద్ద ఘోరం ేపీలో చోటు చేసుకుంది. నవీన్ అనే యువకుడ్ని కొట్టి .. పడేసి మూత్రం పోశారు దుండగులు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే.. నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరంతా చిల్లర దొంగలనివారిలో వారికి గొడవలు రావడంతో ఇలా చేశారనిపోలీసులు చెబుతున్నారు.
ఒంగోలులో మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అనే చిల్లర దొంగలు.. స్నేహంగా ఉంటారు. నవీన్ చాలా సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. కానీ రామాంజనేయులు మాత్రం దొరకలేదు. ఇతర స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్న వీరి మధ్య గొడవ జరిగింది. అందరూ కలిసి నవీన్ ను చితకబాదారు. రక్తంలు వచ్చేలా కొట్టారు. వదిలేయాలని ప్రాధేయపడ్డా విడిచిపెట్టాలేదు. అతని నోట్లో మూత్ర పోశారు. ఇంకా దారుణంగా ప్రవర్తించారు.
ఈ పైశాచికత్వాన్ని కొందరు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవ్వడంతో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే ఫిర్యాదు అందుకున్న పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. కానీ వారిలో ఎవర్నీ అరెస్టు చేయలేదు. బాధితుడు గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం నమోదు చేశారు.
ఏపీలో సైకోలు చెలరేగిపోతున్నారు. వారిలో తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం లేకుండా పోయింది. పోలీసులు నిందితుల్ని పట్టుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూండటం.. రాజకీయ అండ ఉన్న వారికి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూండటంతో.. సైకోలు చెలరేగిపోతున్నారు.