అశోక్ గజపతిరాజును తొలగించి తనను చైర్మన్ చేయాలని ఆనందగజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళా గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం సంచయితతో పాటు తనను కూడా వారసురాలిగా గుర్తించిందని.. సంచయిత కాకపోతే తననే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా చేయాలని ఆమె పిటిషన్లో కోరారు. ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచైత. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఊర్మిళ సంతానం. ఇటీవలి కాలం వరకూ వారు విదేశాల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఇండియాకు వచ్చేశారు. విజయనగరంలోనే ఉంటున్నారు.
తాజాగా అశోక్ గజపతిరాజును తొలగించి.. తనను చైర్మన్ ను చేయాలని ఊర్మిళా గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేయడం.. కలకలం రేపుతోంది. తనను పదవి నుంచి తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచయిత ఇంత వరకూ సవాల్ చేయలేదు. కానీ అనూహ్యంగా ఊర్మిళను తెరపైకి తీసుకు వచ్చారు. ఊర్మిళ గజపతిరాజు కుటుంబం మొదటి నుంచి సంచైతను తీవ్రంగా వ్యతేరికించారు. కానీ ప్రభుత్వాన్ని మాత్రం ఏమీ అనలేదు. కొద్ది రోజుల క్రితం సిరిమాను ఉత్సవం సందర్భంగా కోటపై ఆనందగజపతిరాజు కుటుంబాన్ని కూర్చోనీయలేదు. తమను అవమానించారని ఊర్మిళతో పాటు ఆమె తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
సంచయితను ఎదుర్కోవడానికి తాను సిద్ధమని.. ఆనందగజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళా గజపతి రాజు అప్పట్నుంచి ప్రకటనలు చేస్తున్నారు. చెబుతున్నారు. సంచయిత అనే వ్యక్తిని మాన్సాస్ ట్రాస్ట్ చైర్ పర్సన్ కాక ముందు తామెప్పుడూ చూడలేదని చెబుతున్నారు. అయితే సంచయితను తొలగించిన తర్వాత అశోక్ గజపతిరాజు చైర్మన్ అయితే ఆమె సంతోషించలేదు. అంటే ఆయనతో ఆనందగజపతిరాజు రెండోభార్య, కుమార్తెకూ సరిపడటం లేదని తెలుస్తోంది. ఈ కేసుపై మంగళవారం మరోసారి విచారణ జరగనుంది.