ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యుల్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాని ఎంపిక చేశారు. ఊర్వశి స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్సలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఇటివల బాలయ్య డాకు మహారాజ్ లో ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమా సైన్ చేసింది. ప్రశాంత్ నీల్ పాత్రలు హై ఇంటన్సిటీతోనే వుంటాయి. ఇందులో ఊర్వశి చేయబోయే పాత్ర కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. 1969 నాటి చైనా-భూటాన్-ఇండియా బోర్డర్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమాని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఊర్వశి షూటింగ్ లో జాయిన్ కాబోతోంది. ఊర్వశికి గ్లామర్ క్వీన్ ట్యాగ్ వుంది. అయితే కేవలం డ్యాన్సులు గ్లామరే కాకుండా నటిగా నిరూపించుకోవాలని తపన పడుతోంది ఊర్వశి. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రావడం తన కెరీర్‌కు బూస్ట్ ఇవ్వనుందని భావిస్తుంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఊర్వశి కోరిన ఎన్టీఆర్ సినిమా తీరుస్తుందేమో చూడాలి.