చికాగోలో కథానాయికల చీకటి భాగోతాలు బయటపడ్డాక.. తెలుగు కథానాయికలపై అనుమానపు నీలి నీడలు కమ్ముకున్నాయి. యూ ఎస్ అథారిటీస్ టాలీవుడ్ కి చెందిన పలువురు కథానాయికల్ని ప్రశ్నించడం మొదలెట్టారు. మెహరీన్ కి ఇలాంటి అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు యాంకర్ కమ్ ఐటెమ్ స్పెషలిస్ట్ అనసూయని కూడా యూ ఎస్ అథారిటీస్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు అందాల్సివుంది. కేవలం వాళ్ల దర్యాప్తులో భాగంగా కొంతమంది టాలీవుడ్ కథానాయికల్ని యూ ఎస్ అథారిటీస్ టార్గెట్ చేసినట్టు సమాచారం. ఈ జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రకుల్‌నే కాదు, తరచూ షూటింగులు, అవార్డు వేడుకల నిమిత్తం విదేశాలకు వెళ్లే కథానాయికలందరి లిస్టుని సేకరించి, వాళ్లని అధికారులు ప్రశ్నించబోతున్నారట. అందుకే కథానాయికలు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విదేశీ టూర్లంటే వాళ్లలో ఇది వరకెప్పుడూ లేని భయం కనిపిస్తోంది. ఎవరో కొంతమంది చేసిన తప్పులకు తామంతా తలదించుకోవాల్సివస్తోందని సీనియర్ కథానాయికలు వాపోతున్నారు. ఎవరైనా సరే.. దొరకనంత వరకే. ఒక్కసారి ఈ తెరలు తీసేశాక… దొంగ ఎవరో, దొర ఎవరో తేలుతుంది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కొంతమంది యూ ఎస్ అథారిటీస్ పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారు. డ్రగ్స్ కేసు, కాస్టింగ్ కౌచ్ వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టాలీవుడ్‌కి… ఇది మరో అలజడి కిందే లెక్క. దీన్నుంచి తేరుకోవడానికి ఎంత కాలం పడుతుందో..?