మన ఇంట్లోకి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తిని అక్రమంగా ప్రవేశిస్తే ఏం చేస్తాం ?. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వ్యక్తుల్ని ఏం చేస్తాం ?. ఇదే ప్రశ్నల్ని అమెరికా ప్రభుత్వం తరపున వేసుకుంటే వారు చేసేది వారు చేస్తున్నారు. తమ దేశంలోఇల్లీగల్ గా వచ్చిన వారిని పంపేస్తున్నారు. వారికి సంకెళ్లు వేస్తున్నారు. తమ దేశంలోకి అక్రమంగా వచ్చిన వారికి అలా సంకెళ్లు వేయాలన్నది రూల్అని అమెరికా చెబుతోంది. భారత విదేశాంగ మంత్రి కూడా అదే చెబుతున్నారు. అక్రమంగా అమెరికాలోకి వెళ్లిన భారతీయుల్ని పట్టుకుని సంకెళ్లు వేసి.. విమానాల్లో తీసుకొచ్చి ఇండియాకు వదిలేస్తున్నారు. విమానంలోకి ఎక్కిన తర్వాత సంకెళ్లు తీసేస్తున్నారు.
ఇలా సంకెళ్లు వేయడంపై కేంద్రం చేతకానితనమని విమర్శలు చేస్తున్నారు మన పార్టీలు.. నేతలు. అమెరికాలోకి అక్రమంగా వెళ్లినందుకు అక్కడి జైళ్లలో పెట్టకుండా పంపేసినందుకు అదీ కూడా వారి ఖర్చుతో తీసుకొచ్చి దింపుతున్నందున వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎంత మందిని అని జైళ్లలో పెడతాం..దాని కన్నా తీసుకెళ్లి వదిలి పెట్టి వస్తే మంచిదని ట్రంప్ అనుకుని ఉండవచ్చు. అదే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క ఇండియన్స్ కే సంకెళ్లు వేయడం లేదు. అందరికీ వేస్తున్నారు. తమ దేశంలో అక్రమంగా చొరబడిన ప్రతి ఒక్కరికి సంకెళ్లు వేసి.. ఆయా దేశాలకు తరలిస్తున్నారు.
అక్రమ వలసదారుల్ని ఇలా బలవంతంగా తరలించడంలో అమెరికా తప్పేమీ లేదు. ఇంకా చెప్పాలంటే అమెరికాను తప్పపట్టడం కూడా కరెక్ట్ కాదు. ఏ దేశం కూడా తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారిని ఉపేక్షించదు. మన దేశంలో వీసాలు ముగిసిపోయిన ఆఫ్రికన్లు చాలా మంది ఉంటారు. వారు ఇక్కడ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నా మన అధారిటీలు పెద్దగా పట్టించుకోవు. కానీ అమెరికా అలా కాదు.. ముఖ్యంగా ట్రంప్ అలా కాదు.