పోలవరం ఆలస్యం, నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలపై ఈ రోజు సాక్షిలో తీవ్రంగానే చర్చ చేశాము. కాఫర్ డ్యాం విషయమై బిజెపి కేంద్రం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడాన్ని విమర్శించాను. ఈ చర్చ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖ బాధ్యతలు చూసిన ఒక కాంగ్రెస్ మంత్రి ఫోన్ చేశారు. కాఫర్ డ్యాం కట్టిన మేరకు ఒక నీటిమట్టంలో వినియోగించి నీటిని విడుదల చేస్తే మంచిదేనని ఆయన అన్నారు. దీన్ని వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు ఆహ్వానించదగినవన్నారు. అయితే దానిపై ఎంతవరకూ ఆధారపడొచ్చు వంటి విషయాలపై మరింత అధ్యయనం అవసరమన్నారు. అదే సమయంలో ఎపిసిసి వైఖరి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాలువలు తవ్వింది మేమే అయినప్పుడు పట్టిసీమ ఎత్తిపోతలను వ్యతిరేకించడం తగదని తాను రఘువీరారెడ్డి వంటి వారికి సూచించినా వినలేదని దానివల్ల చంద్రబాబుకు ప్రచారం వచ్చిందని ఆయన అన్నారు.