ఏపీలో ఎన్నికల వేడి రాజుకొంది. పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. ఆయన్నుంచి సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు మరో రెండు మూడు నెలల వరకూ రావు… అని ఫ్యాన్స్ కూడా ఫిక్సయిపోయిన వేళ.. అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కొత్త టీజర్ బయటకు వచ్చింది. వేళ కాని వేళ టీజర్ వదులుతున్నారంటే.. అందులోనూ పొలిటికల్ హీట్ ఉంటుందని కొంతమంది అనుమానించారు. అదే నిజమైంది. జనసేన గుర్తు `గాజు గ్లాసు` పవరేంటో చెబుతూ పవన్ కల్యాణ్ పేల్చిన డైలాగ్.. ఈ టీజర్‌కే హైలెట్ గా నిలిచింది. నిమిషం నిడివి ఎన్న టీజర్ ఇది. టీజర్ తొలి భాగంలో రౌడీ మూకల అరాచకాల్ని చూపించారు. ఆ తరవాత పవన్ ఎంట్రీ వచ్చింది. ‘నీ రేంజ్ ఇది.. ‘ అంటూ టీ గ్లాసుని నేలమీద వేసి పగలగొట్టి ‘గాజు గ్లాసు’ని తక్కువ చేయాలని చూస్తే.. దానికి పవన్ ‘గాజు పగలే కొద్దీ పదునెక్కుద్ది’ అంటూ కౌంటర్ వేశాడు. చివర్లో ‘గ్లాసంటే సైజు కాదు.. సైన్యం’ అంటూ పగలిగిన గాజు గ్లాసుతోనే ఓ యుద్ధం చేశాడు పవన్. మొత్తానికి గాజు గ్లాసంటే టీ తాగేశాక చెత్త బుట్టలో పడేయాలి.. అని చెప్పిన వాళ్లకు ఈ టీజర్ తో పవన్ సమాధానం చెప్పినట్టైంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజియమ్, విజువల్స్.. ఈ టీజర్‌ని మరింత ఎలివేట్ చేశాయి. వరకు కూడా `ఉస్తాద్` నుంచి ఓ టీజర్ వచ్చింది. అందులోని కొన్ని షాట్లు ఇక్కడా రిపీట్ అయ్యాయి. కాకపోతే… పవన్ ఫ్యాన్స్‌కు మరి కొన్ని రోజుల పాటు సరిపడా విందును ఈ చిన్న టీజర్‌తోనే అందించేశాడు హరీష్ శంకర్.