తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. కేసీఆర్ చేస్తున్న ప్రచారంపై.. పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చేయాలనుకున్న ఏ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకున్నారో చెప్పాలని సవాల్ చేశారు. జర్నలిస్టులు ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో మేం పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డాడా?.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డాడా? దళితులకు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు పడ్డాడా? అని సూటిగా ప్రశ్నించారు. టీ టీడీపీ నేతలు.. ఆంధ్రా వాళ్లా అని ప్రశ్నించారు. ఎల్.రమణ, కోదండరామ్, చాడ వెంకటరెడ్డి ఆంధ్రావాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పై .. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుప్డారు. కేసీఆర్ ఓ బ్రోకర్ .. కేరక్టర్ లెస్ ఫెలో అని మండిపడ్డారు. కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు అమ్ముకుంటున్నప్పుడు…తాను బోర్డర్లో పోరాటం చేశానన్నారు. పదిహేనేళ్ల వయసులోనే ప్రాణత్యాగానికి సిద్ధమయ్యానని.. తన గురించి కేసీఆర్ మాట్లాడటేమిటన్నారు. కేసీఆర్ బతుకంతా అవినీతేనని… దొంగ పాస్ పోర్టు కేసులో ఇరుక్కుంటే ఎమ్మెస్సార్ కాపాడారని గుర్తు చేశారు. తాగుబోతులకు రాష్ట్రాన్ని పాలించే అర్హతలేదన్నారు. తన గురించి తండ్రీకొడుకులు అడ్డదిడ్డంగా మాట్లాడారని .. తను .., తన భార్య ప్రజలకోసం జీవితాన్ని అంకితం చేశామన్నారు.
కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లడుగుడుతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. నీళ్లిస్తానే ఓట్లడుగుతానని ప్రకటించి.. ఇప్పుడు నీళ్లివ్వకుండా ఎందుకు ఓట్ల కోసం వెళ్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్‌కు ఓట్లడిగేందుకు సిగ్గులేదా? అని విమర్శించారు. ఒక్క విద్యార్థికైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదనన్నారు. సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదన్న ఉత్తమ్ తెలంగాణ ఇచ్చినవారిని కేసీఆర్ కించపర్చుతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తెలంగాణలో 67శాతం మంది ప్రజలు…టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ సీఎం కావాలని కోరుకోలేదని కేవలం 33 శాతం ఓట్లే టీఆర్ఎస్ కు వచ్చాయని గుర్తు చేశారు. రాజకీయాలను నీచాతినీచంగా దిగజార్చిన ఘనత కేసీఆర్‌దన్నారు. దేశంలోనే కేసీఆర్ కేడీ నెంబర్ వన్ అని మండిపడ్డారు .
తెలంగాణ 24 గంటల కరెంటు ఇస్తున్నానని చెబుతున్న కేసీఆర్.. ఎక్కడ విద్యుత్ ప్రాజెక్టులు కట్టారో.. ఎక్కడ విద్యుదుత్పత్తి చేశారో చెప్పాలన్నారు. దేశమంతా ఇప్పుడు మిగులు విద్యుత్ ఉందని ఇలాంటి సమయంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం పెద్ద విషయం కాదన్నారు. కొత్తగా ఒక్క యూనిట్ ఉత్పత్తి చేసిన పవర్ ప్రాజెక్ట్ పేరు చెప్పమని నిలదీశారు. ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేని సన్నాసులు దద్దమ్మలు తండ్రీకొడుకునన్నారు. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదుని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు సాయం అందజేస్తామన్నారు. డిసెంబర్ 11న మహాకూటమి గెలవడం లాంఛనమేని…తెలంగాణలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్ అమెరికా పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.