తెలంగాణ పిసిసి ప్రస్తుత అద్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికే మరోసారి ఆ పదవి ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధి కాంగ్రెస్ అద్యక్షుడుగా ప్రకటించిన మర్నాడే కొన్ని రాష్ట్రాల పిసిసిలు ప్రకటిస్తారట. అందులో మొదట తెలంగాణ వుంటుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఉన్నంతలో ఉత్తమ కుమార్‌పై వివాదాలు ఆరోపణలు తక్కువగా వుండటం ప్రతికూల పరిస్థితులలోనూ పార్టీ స్థయిర్యం నిలబెట్టడం ఉత్తమ్‌కు అనుకూలంగా మారాయని అందుకే అధిష్టానం ఆయనవైపు మొగ్గిందని ఢిల్లీ రాజకీయాల్లో మంచి అనుభవం కలిగిన ఒక మాజీ ఎంపి నాతో అన్నారు. ప్రస్తుతానికి రెడ్డి వర్గాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు అతి ముఖ్యమైన అవసరంగా మారిందనే కోణంలో ఈ కొనసాగింపు జరగనుంది. ముందు వారుంటే ఇతర సామాజిక తరగతులు ఎలాగూ వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ప్రచారానికి బాగా ఉపయోగపడతారని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.