తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పార్లమెంట్లో కశ్మీర్ బిల్లు పాసయినప్పటి నుండి.. అమిత్‌షా కేంద్రంగా చేసుకుని… తెలంగాణలో ఓ కొత్త రాజకీయ పోరాటం ప్రారంభించారు. కాంగ్రెస్‌ను మించి తెలంగాణలో ఎదగాలనుకుంటున్న బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను.. కాంగ్రెస్‌కు అనుకూలంగా.. బీజేపీకి వ్యతిరేకంగా పెంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ.. అమిత్ షా ఎక్కడ.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజకీయానికి దొరికారంటే.. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిందని… ప్రకటించడం దగ్గర. దీన్నే ఉత్తమ్ కుమార్ రెడ్డి… తెలంగాణలో చెబుతున్నారు. ఒక్క రోజు కాదు.. రోజూ… చెబుతూ.. ప్రజల్లో చర్చనీయాంశం చేయాలనుకున్నారు.
కశ్మీర్ విభజన బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు… రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. కశ్మీర్‌ను విభజిస్తున్నారంటూ.. కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. దీనిపై అమిత్ షా… కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను.. విభజించిన తీరు గుర్తు చేసి.. మీరేమైనా.. రాజ్యాంగబద్ధగా విభజించారా.. అని ప్రశ్నించారు. పార్లమెంట్ తలుపులు మూసి ఏపీని విభజించారన్నారు. అప్పటికి కాంగ్రెస్ నేతలు.. తాము రాజ్యాంగ బద్ధంగానే ఏపీని విభజించామని చెప్పుకున్నారు కానీ.. తెలంగాణకు వచ్చే సరికి. అమిత్ షా వ్యాఖ్యలు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అస్త్రంగా మారాయి. అమిత్ షా… తెలంగాణను అవమానించారని.. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతున్నారంటూ.. ఆయన మండిపడటం ప్రారంభించారు.
ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎప్పుడు మీడియాతో మాట్లాడినా ఉత్తమ్ కచ్చితంగా అమిత్ షా మాటల ప్రస్తావన తెస్తున్నారు. జమ్మూకశ్మీర్ అంశంపై అమిత్‌షా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు విషయాన్ని 5 సార్లు ప్రస్తావించారు. లోక్‌సభలో దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అన్నారు. అది సరికాదు. ఏ బిల్లుపై ఓటింగ్ జరగాలన్నా సభల తలుపులు మూసే ఓటింగ్ చేపడతారని ఉత్తమ్ చెబుతున్నారు. అమిత్‌షా వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటును బీజేపీ తప్పుపడుతోందని అనుమానం కలుగుతోందని ఆయన అంటున్నారు. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి బీజేపీ నేతలు .. ఏ వాదనతో తెరమీదకు వస్తారో మరి..!