ఉత్తరప్రదేశ్ బీజేపీలో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మొదటి నుంచి యోగి ఆదిత్యనాథ్ ను టార్గెట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దానికి సంబంధించిన పరిణామాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. యోగి తీరుపై అసంతృప్తితో ఉన్న నేతలు ఢిల్లీలో హడావుడి ప్రారభించారు. వారికి హైకమాండ్ మద్దతు లభిస్తోంది. కేశవ్ ప్రసాద్ మౌర్య అనే నేతను యోగికి పోటీగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన పార్టీనే అన్నింటి కన్నా సుప్రీం అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు.
యోగిని రీప్లేస్ చేసి మౌర్యను సీఎంను చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు . కానీ ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ.. యోగి ప్రాధాన్యతను తగ్గించేలా ఆయనను డిప్యూటీ సీఎంను చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ, అమిత్ షాలకు యోగి ఆదిత్యనాథ్ మీద అంత గొప్ప అభిప్రాయం లేదు. ఆయను తప్పించాలని అనుకుంటున్నారు. కానీ ఆదిత్యనాథ్ తన పనితీరుతో కొంత ఇమేజ్ పెంచుకోవడంతో ఆయన జోలికి వెళ్లలేకపోయారు
యూపీలో మూడో సారి కూడా ఎక్కువ సీట్లు సాధించి ఉంటే.. బీజేపీలో అత్యంత బలమన నేతగా ఆదిత్యనాథ్ ఎదిగేవారు. అది అమిత్ షాకు ఇబ్బందికరమే. మోదీ తర్వాత ఆయనే ప్రధాని అని చాలా మంది అనుకుంటారు.. కానీ ఆయన కన్నా బాగా వయసులో చిన్న వాడైన ఆదిత్యనాథ్ పోటీలోకి వస్తారు. ఇలాంటి ప రిస్థితిని నివారించడానికి యూపీలో ఆయన ప్రాధాన్యతను తగ్గించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోది. దాని ప్రతిఫలమే ప్రస్తుత పంచాయతీ అనుకోవచ్చు.