అమితాబ్ బచ్చన్ కి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. నిజమే.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్! ఆయనకొక్కడికే కాదు ఆయన భార్య జయ బచ్చన్, వారి కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా పెన్షన్ మంజూరు చేసింది. అది కూడా వందో..వెయ్యో కాదు. ఒక్కొకరికీ నెలకి రూ. 50,000 చొప్పున జీవితాంతం!
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ‘యష్ భారతి సమ్మాన్’ అనే ఒక ‘సన్మాన పెన్షన్ పధకం’ ఆరంభించింది. దానికి వారి ముగ్గురు పేర్లను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు వలన రాష్ట్రానికి ఎంతో గౌరవం, పేరు ప్రతిష్టలు కలిగాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వారు ముగ్గురికీ పెన్షన్ మంజూరు చేసింది. అయితే అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యా బచ్చన్ వదిలిపెట్టేసారు. ఆమె అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకొని బచ్చన్ కుటుంబ సభ్యురాలు అయినప్పటికీ ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కనుక ఆమెకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయలేదేమో… ఎలాగ బ్రతుకుతుందో ఏమో…పాపం?