ప్రేమకథలతో ట్రెండ్ సెట్ సినిమాలను తీసిన దర్శకుడు తేజకు ఈ మధ్య కాలం కలిసి రావట్లేదు. ఇటీవల వచ్చిన హోరాహోరీ కూడా అపజయపాలవ్వడంతో ఇక తేజ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడనుకున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా తేజ సినిమా నిర్మించడానికి నిర్మాతలు రావడం విశేషం. అయితే ఈసారి తేజ పెద్ద నిర్మాణ సంస్థలో తర్వాత సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.
యుటివి మోషన్ పిక్చర్స్ బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను తీస్తున్న ఈ నిర్మాణ సంస్థ తెలుగులో కూడా చాలా సినిమాలను నిర్మించింది. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ తేజ సినిమాను నిర్మించడం జరుగుతుందట. ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న సినిమా సమాచారం త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు తేజ తన కథ కాకుండా బయట కథని తీసుకున్నాడట. అంతేకాదు సినిమాకు సంగీత దర్శకుడిగా ప్రీతం కెమెరామెన్ గా రత్నవేలు పనిచేస్తున్నారని హడావిడి చేస్తున్నారు.
వరుస అపజయాలతో విసిగిపోయిన తేజ ఈ సారి అదిరిపోయే సినిమాని ప్రేక్షకులకు అందించాలనే కసితో రాబోయే సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమా గురించి మిగతా విషయాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.