ప్రభాస్ ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధమౌతోంది. జూన్ 16న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. మరోవైపు బిజినెస్ లెక్కలు కూడా ఓ కొలిక్కి వచ్చేస్తున్నాయి.
ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులు ప్రభాస్ కి ఇచ్చేశారు నిర్మాతలు. ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఇచ్చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన మొత్తంలో యూవీ క్రియేషన్స్ కి ప్రభాస్ దాదాపు వందకోట్లు ఇచ్చారని తెలిసింది.
యూవీ క్రియేషన్స్ కి చాలా రోజులుగా కొన్ని పాత అప్పులు వున్నాయి. నిర్మాత దిల్ రాజుకి నలభై కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆ మొత్తానన్ని సింగల్ పేమెంట్ లో సెటిల్ చేశారని తెలిసింది. దీంతో పాటు ఇంకొన్ని బాకీలు కూడా తీర్చేసి తనపైన వున్న భారాన్ని తగ్గించుకుంది యూవీ క్రియేషన్స్.