యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి సినిమాతో నిర్మాతలుగా మారిన యు.వి.క్రియేషన్స్ అధినేతలు ఆ సినిమా హిట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. దాని తర్వాత కూడా రన్ రాజా రన్, భలే భలే మగాడివోయ్ సినిమాలో ఫుల్ ఫాంలో ఉన్న ఈ నిర్మాణ సంస్థ వారు ప్రస్తుతం శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా సినిమా చేస్తున్నారు. శర్వానంద్ సురభి జంటగా నటిస్తున్న ఎక్స్ ప్రెస్ రాజా సినిమాకు మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు యు.వి.క్రియేషన్స్ వారు. ఎక్స్ ప్రెస్ రాజా సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా కమిట్ అయ్యారట. జిల్ సినిమాతో దర్శకుడిగా మారిన రాధాకృష్ణ డైరక్షన్లో ఈ సినిమా ఉండబోతుందని టాక్. జిల్ సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ అవ్వకపోయినా దర్శకుడిగా రాధాకృష్ణకు మంచి పేరు వచ్చింది.
చరణ్ కు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే కథ రెడీ చేసిన రాధాకృష్ణ యు.వి.క్రియేషన్స్ వారికి చెప్పడంతో సినిమా ఓకే చేశారట. అయితే ఈ సినిమా చరణ్ తని ఒరువన్ తెలుగు రీమేక్ తర్వాత ఉంటుందని టాక్. ఈలోపు డైరక్టర్ రాధాకృష్ణ కూడా మరోసారి తన జిల్ హీరో గోపీచంద్ తో ఓ సినిమా కానిచ్చేస్తాడట. భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లో ఆనంద్ ప్రసాద్ ఆ సినిమాను నిర్మిస్తున్నారు.