అనుష్కతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలి అని దిల్రాజు ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. దానికి తగిన కథ కూడా సిద్ధమైంది. పిల్ల జమిందార్ దర్శకుడు అశోక్ భాగ్మతి అనే స్ర్కిప్టు పట్టుకొని దిల్రాజు వెంట రెండేళ్లుగా తిరుగుతున్నాడు. ఈ కథ అనుష్కకీ నచ్చింది. దిల్రాజు కూడా ఓకే చేశాడు. బాహుబలి 2 లో అనుష్క కాల్షీట్లు పూర్తయిన వెంటనే.. ఈ సినిమా పట్టాలెక్కించాలన్నది ప్లాన్. అయితే సడన్గా ఈ ప్రాజెక్టు నుంచి దిల్రాజు బటయకు వచ్చేశాడు. అంత బడ్జెట్ నేను పెట్టలేను బాబూ… అంటూ కారణాలు చెబుతున్నాడట. ఇప్పుడు ఈ ప్రాజెక్టుని యువీ క్రియేషన్స్ టేకప్ చేసింది.
భాగ్మతికి కనీసం రూ.40 కోట్ల బడ్జెట్ అవసరం అని టాక్. రుద్రమదేవి, సైజ్ జీరోల దెబ్బతో దిల్రాజు వణికిపోయాడట. అనుష్కపై అంత పెట్టుబడి రిస్కే అన్నది దిల్రాజు మాట. కానీ యువీ క్రియేషన్స్ మాత్రం ఈ సినిమాపై నమ్మకంతో… నిర్మాణ బాధ్యతలు చేపట్టిందని సమాచారం.యువీ అంటే.. ప్రభాస్ సొంత సినిమా కిందే లెక్క. దిల్రాజు వదిలేస్తే…ప్రభాస్ ఆదుకొన్నాడన్నమాట.