బ్రిటిష్ వారిపై పోరాడి… ప్రాణాలను అర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను… మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించారు. ఉయ్యాలవాడను సజీవంగా చూసిన వారు ఎవరూ ఇప్పుడు లేరు. కానీ అందరూ మెగాస్టార్లో ఉయ్యాలవాడను చూసుకుంటున్నారు. అంత బాగా.. చిరంజీవి ఉయ్యాలవాడ పాత్రలో ఇంప్రెస్ చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా… చరిత్రను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు… మేకింగ్ వీడియో నుంచే వస్తున్నాయి. బ్రిటిష్ వారిపై పోరాడిన మొట్టమొదటి యోధుడిగా… ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ప్రజెంట్ చేస్తున్నారు. కానీ.. చరిత్రలో..అంతకంటే ముందు ఎంతో మంది యోధులు… బ్రిటిష్ వారిపై ప్రాణాలొడ్డి పోరాడారు.
1840ల్లో ఉయ్యవాడల తిరుగుబాటు..!
రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. బ్రిటిష్ వాళ్లు పెత్తనానికి వచ్చి అరాచకాలు చేస్తున్నప్పుడు.. వారిని వీరోచితంగా ఎదిరించారు. మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేశారు. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. అయితే.. బ్రిటిష్ వారిపై మొదటి సారిగా తిరుగుబాటు చేసింది.. ఉయ్యాలవాడ కాదు.. అంతకు దశాబ్దాల ముందు నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాట్లకు నేతృత్వం వహించిన వారంతా వీరమరణం పొందారు.
1798-99లోనే చార్గా పిలువబడే… బెంగాల్ గిరిజనలు దుర్జన్ సింగ్ ఆనే యోధుడి నేతృత్వంలో ఈస్టిండింయా కంపెనీలపై తిరగబడ్డారు. మిడ్నాపూర్ లో దుర్జన్ సింగ్ హీరో. ఈస్టిండియా కంపెనీ వాళ్ల చేతుల్లోనే హతమయ్యాడు.
ఇదే కాదు.. చాలా ఉన్నాయి..
1778లో చోటానాగపూర్ పహారియా సర్దార్స్
1784లో మహారాష్ట్రలోని కోలి మహదేవ్ గిరిజనలు
1789లో చోటా నాగపూర్ తమర్ ట్రైబల్స్
1798లో పంచెట్ ట్రైబల్స్
1817లో బక్షి జగబంధు అనే ఒడిషా యోధుని నేతృత్వంలో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పైకా తిరుగుబాటు
1829-39 ప్రస్తుతం జార్ఖండ్ ఉన్న ప్రాంతంలో కొల్ వర్గం ప్రజల తిరుగుబాటు
1846-55 ప్రాంతంలో బీహార్ లోని ఖోండ్ ప్రజలు చక్ర బిష్ణోయ్ అనే యోధుని నేతృత్వంలో బ్రిటిష్ పై తిరుగుబాటు
ఇవి చరిత్రలో ఉన్న కొన్ని దృష్టాంతాలు మాత్రమే. ఈస్టిండియా కంపెనీ ఇండియాను ఆక్రమించేసినప్పుడు… ప్రతీ చోటా పోరాటాలు జరిగాయి. కొన్ని వందల మంది వీరమరణం పొందారు. ఉయ్యాలవాడ కంటే ముందే … ఎంతో మంది పోరాడారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి… తిరుగుబాటు.. అప్పటి బ్రిటిష్ పాలకుల్లో వణుకు పుట్టించారు అయితే.. ఆయితే అలా చేసింది ఆయనే మొదటి వ్యక్తి కాదు. సినిమాటిక్ క్రేజ్ కోసం… లేదా.. తాము సినిమా చేస్తున్నామను కాబట్టి… చరిత్రను వక్రీకరించే విషయంలో.. సైరా టీం.. కాస్త.. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లుగా… కనిపిస్తోంది.