కాంగ్రెస్ పార్టీకి నాన్ పెర్మార్మింగ్ అసెట్‌గా మారి … ఇక ముందుకెళ్లడానికి కూడా అడ్డం పడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న వీహెచ్.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిన్నటిదాకా కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేసిన ఆయన ఒక్కసారిగా.. సీఎంలో మంచి లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల కిందట.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఖరారు చేస్తున్నారని ప్రచారం జరగగానే.. ముందూ వెనుకా ఆలోచించకుండా…తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిగం ఠాగూర్ పై ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్యాకేజీకి అమ్ముడుపోయారని ఆరోపించారు.
అసలు కాంగ్రెస్ కు వీహెచ్ వల్ల ఏమీ ఉపయోగ ంలేకపోగా.. ఇలా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని.. తీవ్ర అసంతృప్తిలో ఉన్న హైకమాండ్ ఆయనపై వేటు వేయడానికి సిద్ధమయింది. పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి నివేదిక తెప్పించుకుంది. షోకాజ్ నోటీసు జారీ చేయడమో.. లేదా.. అలా కూడా చేయకుండా సస్పెండ్ చేయడమో చేస్తారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఆయన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఓ కులసంఘం సమావేశానికి వెళ్లి.. కేసీఆర్ అ్ని కులాలకు ఎంతో మేలు చేస్తున్నారని.. గతంలో ఏ సీఎం అలా చేయలేదని సర్టిఫికెట్ జారీ చేసేశారు.
కేసీఆర్.. కుల సంఘాలకు భవనాల పేరుతో ఆరేళ్లుగా అనేక హామీలిచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఒక్కటంటే… ఒక్క భవనం కూడా నిర్మించలేదు. వివిధ కులాలకు.. వివిధ పథకాలు పెట్టారు. వాటిని కంటిన్యూ చేయడంలో విఫలమవుతున్నరాు. ఈ సందర్భంగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. వీహెచ్‌కు మాత్రం. .కేసీఆర్ తెగ నచ్చేశారు. ఇదంతా.. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదుర్కొంటున్న దుస్థితికి కారణం అని బావిస్తున్నారు.