తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం.. తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణం అయింది. ఈ దుమారం ప్రధానంగా కేటీఆర్ చుట్టూనే తిరుగుతోంది. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ… కేటీఆర్ పరుషమైన పదజాలాన్ని ప్రయోగించారు. ఇందులో ప్రధానమైనది బపూన్. సీనియర్ నేత వీహెచ్ ను పరోక్షంగా బపూన్ గా అభివర్ణిస్తూ.. కేటీఆర్.. విమర్శలు చేశారు. రెండు రోజుల కిందట… కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లారు. అక్కడికి కేటీఆర్ రావాలని..గ్లోబరీనా సంస్థకు తనకు సంబంధం లేదని… ప్రమాణం చేయాలని హంగామా చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేటీఆర్.. ఓ బపూన్.. తనను పెద్దమ్మగుడికి వచ్చి ప్రమాణం చేయమని డిమాండ్ చేస్తే… వెళ్లి ప్రమాణం చేయాలా.. అని ప్రశ్నించారు. ఈ పదప్రయోగంపై… కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు.
వీహెచ్ అయితే.. శివాలెత్తిపోయారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు..కేటీఆర్ పుట్టలేదని… అలాంటి కేటీఆర్ బఫూన్ అంటున్నారు… మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కేటీఆర్ బావమరిది స్నేహితుడికి గ్లోబరీనా టెండర్ ఇచ్చారని.. బావమరిది మీద మోజుతో 22మంది విద్యార్థులను బలిగొన్నారని మరోసారిఆరోపించారు. తాను రెచ్చిపోతే ప్రభుత్వం పడిపోతుందని వీహెచ్చ హెచ్చరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడులు చేయాలని కూడా వీహెచ్ పిలుపునిచ్చారు. వీహెచ్ కు మద్దతుగా.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. విద్యార్థుల సమస్యలపై వీహెచ్ పోరాడుతుంటే.. కుర్రకుంక ఆయన్ని బఫూన్ అంటున్నాడని విమర్శించారు. తెలంగాణలో ఎంత బలుపు పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలని రేవంత్ ప్రజలను కోరారు. బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు.
వీహెచ్ గురించి.. కేటీఆర్ తన తండ్రిని అడిగి తెలుసుకోవాలని రేవంత్ సూచించారు. ఎంసెట్ లీకేజీ కేసులో కేటీఆర్ ఫ్రెండ్ మామ సంస్థ అయిన మాగ్నటిక్ ఇన్ఫోటెక్పై.. ఇంత వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ బపూన్ వ్యాఖ్యలపై.. తెలంగాణలో రాజకీయ కలకలం కొనసాగే అవకాశం ఉంది.