చిరంజీవి 150వ సినిమా ఖైది నెం.150ని సూపర్ హిట్ చేసి మెగా అభిమానుల మనసు మరోసారి దోచుకొన్నాడు వినాయక్. అయితే ఖైదీ తరవాత వినాయక్ కొంత గ్యాప్ తీసుకొన్నాడు. పెద్ద హీరోలంతా తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో వినాయక్ విరామం తీసుకోక తప్పలేదు. ఎట్టకేలకు ఇప్పుడు తన తదుపరి సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. అందరూ అనుకొంటున్నట్టుగానే సాయిధరమ్ తేజ్‌తో సినిమా ఓకే అయ్యింది. ఈనెల 9న ఈ చిత్రాన్ని లాంఛనంగా మొదలెడతారు. వినాయక్ స్టైల్లోనే యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. కథానాయికగా లావణ్య త్రిపాఠి పేరు పరిశీలిస్తున్నారు. జవాన్ సినిమా షూటింగ్ పూర్తయ్యాకే.. వినాయక్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈలోగా పూర్తి వివరాలు బయటకు వస్తాయి.