చంద్రబాబు కేసులో పిటిషన్లు విచారించడానికి న్యాయమూర్తులు సైతం వెనుకాడుతున్నారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ శుక్రవారం వెకేషన్ బెంచ్ ముందుకు విచాణకు వచ్చింది. విచాణ జరపకుండానే నాట్ బిఫోర్ మి అన్న వెకేషన్ బెంచ్ జస్టిస్ జ్యోతిర్మయి… చీఫ్ జస్టిస్ ముుందు ఉంచాలని రిజిస్ట్రీకి సూచించారు ఏ బెంచ్ విచారించాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యామ్నాయ మార్గాలకు తన ఉత్తర్వులు అడ్డు కావని న్యాయమూర్తి చెప్పారు. తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
స్కిల్ కేసులో చంద్రబాబును సాంకేతిక కారణాలు చూపి బయటకు రాకుండా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లో ఉంచుతున్నారని టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. మరో వైపు చంద్రబాబు జైలులో తన భద్రతపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఏసీబీ జడ్జికి లేఖ రాశారు. ఓ ఖైదీకి పెన్ కెమెరా ఇచ్చి ఉద్దేశపూర్వకంగా తన బ్యారక్ దృశ్యాలను చిత్రీకరింపచేస్తున్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. జైలు లోపలి దృశ్యాలు అధికార పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో కనిపిస్తున్నాయన్నారు. తనను హత్య చేస్తానని బెదిరిస్తూ జైలు అధికారులకు ఓ లేఖ వచ్చిందని.. దానిపై పోలీసులు విచారణ జరపలేదన్నారు.
జైలుపై పలుమార్లు డ్రోన్లు ఎగిరినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనపై భౌతిక దాడులు చేస్తోందని గతంలో జరిగిన పలు ఘటలను ఉదహరించారు. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు ఈ లేఖ రాసి రెండు రోజులు అవుతోంది. తాను జడ్ ప్లస్ ప్రొటెక్టీనని… కానీ తన భద్రత విషయంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని చంద్రబాబు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.