వైభవ్ సూర్యవంశీ .. ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. పధ్నాలుగు ఏళ్ల వయసుకే టీమ్‌లోకి రావడమే కాదు.. తుది జట్టులో చోటు లేకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగి.. ఫస్ట్ బంతినే సిక్సర్ గా మలిచాడు. అంతేనా 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టులోకి వైభవ్‌ను తీసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అంత చిన్న పిల్లవాడ్ని ఎలా తీసుకుంటారని అనుకున్నారు.
వైభవ్ సూర్యవంశీ .. ఇప్పుడు ఎనిమిదో తరగతి మాత్రమే చదువుతున్నాడు. అండర్ 14 టీమ్ మ్యాచుల్లో చూపించిన ప్రతిభతో రాజస్థాన్ జట్టులోకితీసుకుంది. స్కూల్ దశలోనే కోట్ల మంది చూసే .. వేల మంది మధ్య..ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాటింగ్. చేశాడు. తొలి బంతినే సిక్సర్ గా మలిచాడు. సాంకేతికంగా కూడా ఉన్నతంగా.. లక్కీ షాట్స్ తోనే పరుగులు వచ్చాయని కాకుండా… ఎంతో ప్రతిభ ఉందని నిరూపించుకున్నాడు. ఔటై వెళ్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ ఆ కన్నీళ్లు ఆ పిల్లాడిలో కసిని పెంచుతాయని..క్రికెట్ కు ఎంతో చేస్తాడని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీని ప్రశంసించని వాళ్లు లేరు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా అద్భుతమని ప్రశసించారు. ఆట చూడటానికే నిద్ర లేచానన్నారు. క్రికెట్ దిగ్గజాలు అందరూ వైభవ్ ను ప్రశంసిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెటర్ వైభవ్ హవానే నడుస్తోంది.