ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తరవాత వచ్చిన `కొండపొలెం` నిరాశ పరిచినా, ఆ ఎఫెక్ట్ వైష్ణవ్ కెరీర్‌పై పడలేదు. నటుడిగా తనకు మంచి మార్కులే వచ్చాఇ. ఇప్పుడు మూడో సినిమా మొదలెట్టేస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఎస్.వి.సి.సి సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గిరీశయ్య దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకటిస్తానని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి `రంగ రంగ వైభవంగ` అనే టైటిల్ ఫిక్సయినట్టు సమాచారం. అధికారికంగా రేపు ప్రకటిస్తారు. కితిక శర్మ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గిరీశయ్యకి ఇది రెండో సినిమా. తను అర్జున్ రెడ్డికి కో డైరెక్టర్‌గా పనిచేశాడు. అర్జున్ రెడ్డి తమిళంలో రీమేక్ చేసింది గిరీశయ్యనే. తెలుగులో తనకు ఇది తొలి సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు వెల్లడవుతాయి.