‘బేబీ’తో అందరినీ ఆకట్టుకొంది వైష్ణవి చైతన్య. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. యువ హీరోల పక్కన చైతన్య ఇప్పుడు మంచి ఆప్షన్. తాజాగా వైష్ణవి మరో మంచి ఆఫర్‌ని ఒడిసిపట్టుకొంది. ఆశిష్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో కథానాయికగా వైష్ణవి చైతన్యని ఎంచుకొన్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. వైష్ణవి కూడా సెట్లో అడుగు పెట్టింది. ‘బేబీ’లా ఈ కథ కూడా రొమాంటిక్ లవ్ స్టోరీనే అట. కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉందని, అందుకే వైష్ణవిని ఎంచుకొన్నారని తెలుస్తోంది. ‘రౌడీ బోయ్స్`తో తెరంగేట్రం చేశాడు ఆశిష్. ఆ తరవాత ‘సెల్ఫిష్’ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే, ఈ కొత్త ప్రాజెక్ట్ మొదలెట్టేశారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. టైటిల్ త్వరలోనే ప్రకటిస్తారు.